సిట్‌కు బండి సంజయ్‌ లేఖ.. ‘విచారణకు హాజరుకాలేను’

TSPSC Paper Leak: Bandi Sanjay Letter To SIT - Sakshi

న్యూఢిల్లీ: టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీక్స్‌ వ్యవహారంలో దర్యాప్తు కొనసాగిస్తున్న సిటిక్‌(ప్రత్యేక దర్యాప్తు బృందం) బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ లేఖ రాశారు. పార్లమెంట్‌ సమావేశాల దృష్ట్యా సిట్‌ విచారణకు హాజరు కాలేనని తెలిపారు. పార్లమెంట్‌ సెషన్‌ ముగిసిన తరువాత హాజరవుతాని పేర్కొన్నారు. సిట్‌ను విశ్వసించడం లేదు.. సిట్‌పై తనకు నమ్మకం లేదని చెప్పారు.

‘నా దగ్గర ఉన్న సమాచారాన్ని సిట్‌కు ఇవ్వదల్చుకోలేదు. సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తున్నా. నాకు నమ్మకమున్న సంస్థలకే సమాచారం ఇస్తా. నాకు సిట్‌నోటీసులు అందలేదు. మీడియాలో వచ్చిన సమాచారం మేరకే నేను స్పందిస్తున్నాను. 24న హాజరుకావాలని కోరినట్లు మీడియా ద్వారా నాకు తెలిసింది. పార్లమెంట్‌ సభ్యునిగా నేను సభకు హాజరు కావాల్సి ఉంది. నేను ఖచ్చితంగా హాజరు కావాలని సిట్‌ భావిస్తే మరో తేదీ చెప్పండి.’ అని పేర్కొన్నారు.

కాగా టీఎస్‌పీఎస్‌సీ కేసులో బండి సంజయ్‌కు సిట్‌ మంగళవారం నోటీసులు జారీ చేసింది. మార్చి 24వ తేదీన తమ ఎదుట హాజరు కావాలని అందులో కోరింది. అంతేగాక ఇదే తరహా వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డికి ఇప్పటికే సిట్‌ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 23వ తేదీన తగిన ఆధారాలతో తమ ఎదుట హాజరు కావాలని కోరింది.
చదవండి: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజ్‌తో అప్రమత్తం.. ఎంసెట్‌కు బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top