అత్యవసర వైద్యమందక ఎవరూ మరణించకూడదు

TS Governor Tamilisai Soundararajan Help To Homeless Aged Woman - Sakshi

గవర్నర్‌ తమిళిసై పిలుపు.. వృద్ధ అభాగ్యురాలికి రాజ్‌భవన్‌లో ఆతిథ్యం 

సకాలంలో వైద్యం లభించక కొడుకు, మనవరాలు, అల్లుడిని కోల్పోయిన వృద్ధురాలు 

కలత చెందిన గవర్నర్‌.. రూ. 50 వేల ఆర్థికసాయం

సాక్షి, హైదరాబాద్‌: పాము కాటు, ఇతర అత్యవసర వైద్యసేవలు అవసరమైన సందర్భాల్లో దురదృష్టకర మరణాలను నివారించడా నికి గ్రామీణ ప్రాథమిక వైద్య కేంద్రా (పీహెచ్‌సీ)ల్లో అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు, యాంటీవినం ఇంజెక్షన్లు, మెడికల్‌ కిట్లతోపాటు శిక్షణ పొందిన సిబ్బందిని అందుబాటులో ఉంచాలని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అధికారులను ఆదేశించా రు. ‘పేదలు, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాల ప్రజల కు గ్రామీణ ప్రాంతాల్లో అత్యవసర వైద్య సదుపాయాలను నిరాకరించకూడదు. అవసరమైనప్పుడు అత్యవసర వైద్యం పొందడానికి ఆర్థిక, సామాజిక వెనుకబాటుతనం అడ్డు రాకూడదు’ అని ఆమె పేర్కొన్నారు. ఓ నిరుపేద దళిత వృద్ధురాలి దుస్థితిని తెలు సుకుని చలించిన గవర్నర్‌ .. ఆమెను బుధవారం రాజ్‌భవన్‌కు ఆహ్వానించి మధ్యా హ్న భోజనంతో ఆతిథ్యం ఇ చ్చారు. రెండు, మూడు నెలలకు సరిపడా నిత్యావసర వ స్తువులు, రూ.50 వేల ఆర్థిక సహాయం అందజేశారు.

నిలువ నీడలేక... 
జనగామ జిల్లా పాలకుర్తి మండలం లక్ష్మీనారాయణపురం గ్రామా నికి చెందిన బండిపెల్లి రాజమ్మ(75) నిలువ నీడలేక వీధుల్లో చెట్ల కింద నివాసముంటోంది. దివ్యాంగ కొడుకు ఆమెపై ఆధారపడి ఉన్నాడు. సకాలంలో సరైన వైద్య సదుపాయం లభించక అనారోగ్యంతో ఆమె కోడలు, పాము కాటుకు గురై మనవరాలు మృతి చెందారు. మనవరాలికి సకాలంలో పాముకాటుకు విరుగుడుగా ఇవ్వాల్సిన యాంటీవీనం ఇంజెక్షన్‌ను చేయకపోవడంతో ఆమె మరణించింది. అనారోగ్యానికి గురైన రాజమ్మ అల్లుడు కూడా సరైన వైద్యం అందక మరణించాడు. ఈ విషయాలు తెలుసుకుని గవర్నర్‌ తీవ్రంగా చలించారు. నిరుపేద వృద్ధ మహిళ, ఆమెపై ఆధారపడిన వికలాంగ కొడుకు బాగోగులను చూడాలని జనగామ జిల్లా అధికారులతోపాటు స్థానిక ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ ప్రతినిధులను గవర్నర్‌ ఆదేశించారు. గవర్నర్‌ చొరవతో రాజ్‌భవన్‌లో భోజనం చేస్తున్నానని రాజమ్మ ఆనందంతో కంటనీరుపెట్టింది. రాజమ్మ కోసం ఇంటిని నిర్మించడానికి రూ.1.60 లక్షల విరాళాలను సేకరించడంతోపాటు తన వ్యక్తిగత సహాయంగా రూ.80 వేలు అందించిన పాలకుర్తి ఎస్‌ఐ గండ్రతి సతీశ్‌ చొరవను గవర్నర్‌ కొనియాడారు. రాజమ్మకు అండగా నిలిచిన ఆ గ్రామ మాజీ సర్పంచ్‌ మణెమ్మను గవర్నర్‌ సత్కరించారు. డాక్టర్‌ బి.కృష్ణ, స్వచ్ఛంద కార్యకర్త మహేందర్‌ల కృషిని గవర్నర్‌ ప్రశంసించారు. వీరిద్దరూ వృద్ధ మహిళకు తోడుగా రాజ్‌ భవన్‌కు వచ్చారు. వృద్ధురాలికి ఆర్థిక సాయం అందించిన ఎస్‌ఐకి ఆ మొత్తాన్ని గవర్నర్‌ తమిళిసై తిరిగి ఇచ్చేయడం విశేషం.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top