Telangana Rashtra Samithi (TRS) Party Won In Munugode By Election 2022 - Sakshi
Sakshi News home page

మునుగోడులో టీఆర్‌ఎస్‌ భారీ విజయం.. 

Nov 6 2022 5:22 PM | Updated on Nov 6 2022 6:43 PM

TRS Party Won In Munugode By Election 2022 - Sakshi

మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ రికార్డు విజయం సాధించింది.

సాక్షి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ఘన విజయం సాధించింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి భారీ విజయాన్ని అందుకున్నారు. దాదాపు 10వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో వికర్టీని సాధించారు. ఇక, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి రెండో స్థానంలో, కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి మూడో స్థానంలో నిలిచారు. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ డిపాజిల్‌ కోల్పోవడం గమనార్హం. 

కాగా, మునుగోడు ఉప ఎన్నికల్లో ఇండిపెండెంట్‌ అభ్యర్థి తమ మార్క్‌ చూపించారు. ముఖ్యంగా కారు గుర్తును పోలి ఉన్న చపాతీ రోలర్, రోడ్డు రోలర్ గుర్తులకు భారీగా ఓట్లు పడ్డాయి. ఇక, అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ గెలుపుతో గులాబీ పార్టీ శ్రేణులు సంబురాలు జరుపుకుంటున్నాయి.  

Advertisement
 
Advertisement
Advertisement