సాక్షి, హైదరాబాద్: నగరంలోని మెట్రో స్టేషన్లలోట్రాన్స్‌జెండర్లను భద్రతా సిబ్బందిగా నియమించారు. సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు, సాధికారతను అందజేయడమే లక్ష్యంగా ట్రాన్స్‌జెండర్లకు ఉపాధి కలి్పంచేందుకు భద్రతా సిబ్బందిగా నియమించినట్లు హైదరాబాద్ మెట్రోరైల్ అధికారులు తెలిపారు. 20 మంది ట్రాన్స్‌జెండర్లకు శిక్షణనిచి్చ.. కొన్ని ఎంపిక చేసిన మెట్రో స్టేషన్లలో వీరికి విధులను అప్పగించారు.
ప్రస్తుతం నగరంలోని మూడు కారిడార్లలో 57 స్టేషన్ల నుంచి ప్రతిరోజూ సుమారు 5 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. వీరిలో 30 శాతం మహిళా ప్రయాణికులు ఉన్నారు. మహిళా ప్రయాణికుల భద్రతకు అత్యధిక ప్రాధ్యాన్యమిస్తూ అవసరమైన మేరకు సెక్యూరిటీని ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. ప్రయాణికుల భద్రత కోసం కొత్తగా నియమితులైన ట్రాన్స్‌జెండర్ సెక్యూరిటీ సిబ్బంది మహిళలకు ప్రత్యేకంగా కేటాయించిన కోచ్‌లలో ఇతరులు ప్రవేశించకుండా చర్యలు తీసుకుంటారని తెలిపారు.


