ట్రాక్టర్‌ మునిగినా.. ఈదుతూ బయటపడిన రైతు..

 Tractor Drowned Farmer Survived By Swimming - Sakshi

మహబూబాబాద్: మానుకోటి జిల్లా కురవి మండలంలోని గుండ్రాతిమడుగు(విలేజి) శివారు బంగారుగూడెం జీపీ పరిధిలోని చౌళ్ల తండా వద్ద పొలాలు దున్నేందుకు వెళ్లిన ట్రాక్టర్‌ మున్నేరువాగు వరద నీటిలో గురువారం మునిగిపోయింది.

బంచరాయి తండా గ్రామానికి చెందిన రైతు బానోత్‌ లచ్చిరాం చౌళ్ల తండాకు చెందిన పొలాలను దున్నేందుకు ట్రాక్టర్‌ తీసుకుని వెళ్లాడు. ఈక్రమంలో మున్నేరు వాగు ప్రవాహం పెరిగింది. రెండువైపులా నీరు వచ్చి చేరుతుండడంతో నీటిలో ట్రాక్టర్‌ మునిగిపోయింది. దీంతో లచ్చిరాం ట్రాక్టర్‌ను అక్కడే వదిలి ఈదుకుంటూ ఒడ్డుకు చేరాడు. నీటిలో ట్రాక్టర్‌ మునిగిపోయిన విషయాన్ని రెవెన్యూ అధికారులకు తెలుసుకుని సంఘటన స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top