హైదనాబాద్: నేత కార్మికుల రుణమాఫీ నిధులు విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. నేత కార్మికుల కోసం రూ. 33 కోట్ల నిధులను తెలంగాణ ప్రభుత్వం గురువారం(నవంబర్ 20 వ తేదీ) విడుదల చేసింది. ఈ మేరకు నిధులు విడుదల చేశారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.
గత సెప్టెంబర్ 27వ తేదీన కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా నేత కార్మికుల రుణమాఫీ చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం తాజాగా నేత కార్మికులకు రుణమాఫీ నిధులు విడుదల చేశారు. నేత కార్మికుల నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌కు మంత్రి తుమ్మల ధన్యవాదాలు తెలియజేశారు.


