TSRTC: ఆర్టీసీకి లాభాల పంట.. రికార్డులు బద్దలు

Telangana: TSRTC Earned Rs 14. 07 Crore In Single Day - Sakshi

ఒక్కరోజే రూ.14.07 కోట్ల ఆదాయం

రికార్డు స్థాయి ఆక్యుపెన్సీ రేషియో నమోదు

కోవిడ్‌ ప్రభావం మొదలయ్యాక ఇదే అత్యధికం

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ రికార్డు స్థాయి ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్‌)ను నమోదు చేసుకుంది. ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉండే సోమవారాల్లో, సాధారణ రోజులతో పోలిస్తే కొంత ఆదాయం ఎక్కువగా ఉంటుంది. అలాంటిది ఈ సోమవారం (22న) రికార్డులు బద్దలు కొడుతూ ఏకంగా 77 శాతం ఆక్యుపెన్సీ రేషియో నమోదు చేసుకుంది. కోవిడ్‌ ప్రభావం మొదలయ్యాక ఇదే అత్యధికం. దసరా తర్వాత హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణాల సమయంలో ఒక్కసారి ఈ స్థాయిలో ఓఆర్‌ నమోదైంది.
చదవండి: శభాష్‌ ఆర్టీసీ.. శభాష్‌ సజ్జనార్‌.. తెలంగాణ ఆర్టీసీపై కిన్నెర మొగులయ్య పాట, వైరల్‌

సోమవారం రూ.12.89 కోట్ల ఆదాయాన్ని పొందాలని ఆర్టీసీ లక్ష్యంగా పెట్టుకోగా.. రూ.14.07 కోట్ల ఆదాయం నమోదైంది. గతేడాది ఇదే రోజు రూ.7.85 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. పది రీజియన్లలో లక్ష్యానికి మించి ఆదాయం వచ్చింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ పరిధిలో 75.52 శాతం ఓఆర్‌ నమోదు కాగా, మిగతా ప్రాంతాల్లో కలిపి 85.84 శాతం నమోదైంది. ఇక కిలోమీటరుకు ఆదాయం (ఈపీకే) రూ.40.66 గా నమోదైంది. ఇది కూడా ఇటీవల నమోదైన గరిష్ట మొత్తం కావటం విశేషం.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top