రూ.250 కోట్లతో మెగా విజయ డెయిరీ: మంత్రి తలసాని  | Telangana: Talasani Srinivas Yadav Mega Vijaya Dairy With Rs 250 Crores | Sakshi
Sakshi News home page

రూ.250 కోట్లతో మెగా విజయ డెయిరీ: మంత్రి తలసాని 

Nov 9 2022 2:33 AM | Updated on Nov 9 2022 2:33 AM

Telangana: Talasani Srinivas Yadav Mega Vijaya Dairy With Rs 250 Crores - Sakshi

మంత్రి తలసానిని  కలిసిన భరత్‌కుమార్‌  

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ విజయ డెయిరీ అభివృద్ధిలో భాగంగా రూ. 250 కోట్ల వ్యయంతో మెగా డెయిరీ నిర్మాణం చేపట్టామని రాష్ట్ర పశుసంవర్థక, పాడిపరిశ్రమ, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చొరవతో ప్రస్తుతం రూ.700 కోట్ల టర్నోవర్‌కు విజయ డైరీ చేరుకుందని పేర్కొన్నారు.

తెలంగాణ స్టేట్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ కో–ఆపరేటివ్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌గా నియమితులైన భరత్‌కుమార్‌ మంత్రి తలసానిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు.

Advertisement
 
Advertisement
Advertisement