కొనసాగుతున్న గాలింపు చర్యలు.. మరో మహిళ మృతదేహం లభ్యం | Telangana: Severe Floods Due To Rain, People Missing And Dead | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న గాలింపు చర్యలు.. మరో మహిళ మృతదేహం లభ్యం

Jul 31 2023 5:00 AM | Updated on Jul 31 2023 5:14 AM

Telangana: Severe Floods Due To Rain, People Missing And Dead - Sakshi

భూపాలపల్లి అర్బన్‌: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మోరంచపల్లిలో నాలుగు రోజుల క్రితం వరద ఉధృతిలో కొట్టుకుపోయిన వారిలో ఇప్పటివరకు ముగ్గురి ఆచూకీ లభించింది. కాగా, మరొకరి ఆచూకీ లభించాల్సి ఉంది. మొత్తం నలుగురికి గాను రెండు మృతదేహాలు శనివారం లభించగా...మరో మహిళ మృతదేహం ఆదివారం రాత్రి భూపాలపల్లి మండలం నేరేడుపల్లి సమీప చిర్రవంట చెరువువద్ద కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

సీఐ రాంనర్సింహారెడ్డి అక్కడికి చేరుకుని ఆయా కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వగా ఆమెను గొర్రె వజ్రమ్మగా గుర్తించారు. కాగా, వజ్రమ్మతోపాటు కొట్టుకుపోయిన గడ్డం మహాలక్ష్మి ఆచూకీ ఇంకా లభించలేదు. ఆమె కోసం జిల్లాలోని మోరంచవాగు, మానేరువాగు పరీవాహక ప్రాంతాలతోపాటు భూపాలపల్లి, చిట్యాల, మల్హర్‌ మండలాల పోలీసులు డ్రోన్‌ల ద్వారా సమీప గ్రామాల్లోని ప్రజలతో గాలింపు చర్యలు చేపడుతున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement