Telangana Senior Leader M Shashidhar Reddy Officially Joined BJP - Sakshi
Sakshi News home page

బీజేపీలో చేరిన మర్రి శశిధర్‌రెడ్డి.. టీఆర్‌ఎస్‌ను గద్దె దించేందుకు పోరాటమని ప్రకటన

Nov 25 2022 4:29 PM | Updated on Nov 25 2022 6:01 PM

Telangana Senior Leader M Shashidhar Reddy Officially Joined BJP - Sakshi

తెలంగాణ సీనియర్‌ పొలిటీషియన్‌ మర్రి శశిధర్‌రెడ్డి అధికారికంగా బీజేపీలో చేరిపోయారు.

సాక్షి, ఢిల్లీ: తెలంగాణ సీనియర్‌ పొలిటీషియన్‌ మర్రి శశిధర్‌రెడ్డి అధికారికంగా బీజేపీలో చేరిపోయారు. ఢిల్లీలో శుక్రవారం బీజేపీ కీలక నేతల నడము ఆయన కాషాయం కండువా కప్పుకున్నారు. కేంద్ర మంత్రులు సర్బానంద్‌ సోనావాలా,  కిషన్‌రెడ్డితో పాటు మరికొందరు కీలక నేతలు ఈ చేరిక కార్యక్రమంలో పాల్గొన్నారు. 

తెలంగాణ నుంచి బీజేపీ నేతలు బండి సంజయ్‌, డాక్టర్‌ లక్ష్మణ్‌, డీకే అరుణ, ఈటల రాజేందర్‌.. మర్రిశశిధర్‌ వెంట ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పని అయిపోయిందని,  ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు బీజేపీ బలోపేతం కోసం కృషి చేస్తానని, తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను గద్దె దించేందుక పోరాటం చేస్తానని మర్రి శశిధర్‌రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. 

పార్టీ కోసం కష్టపడేతత‍్వం ఉన్న మర్రి శశిధర్‌ రెడ్డి.. బీజేపీలో చేరడంపై కిషన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, కుటుంబ పాలన అంతం కావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

సనత్‌ నగర్‌ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన మర్రి శశిధర్‌రెడ్డి.. ఈ మధ్యే కాంగ్రెస్‌ను వీడిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement