గడ్కరీకి రాయగిరి రైతుల గోడు  | Telangana: MP Komatireddy Visited Raigiri Farmers Over Regional Ring Road | Sakshi
Sakshi News home page

గడ్కరీకి రాయగిరి రైతుల గోడు 

Sep 11 2022 4:02 AM | Updated on Sep 11 2022 11:08 AM

Telangana: MP Komatireddy Visited Raigiri Farmers Over Regional Ring Road - Sakshi

రాయగిరి రైతులతో ఎంపీ కోమటిరెడ్డి 

సాక్షి, యాదాద్రి: రీజినల్‌ రింగ్‌ రోడ్డుతో భూ­ములు పూర్తిగా కోల్పోతున్న రాయగిరి రైతుల సమస్యను కేంద్ర మంత్రి గడ్కరీని సోమ­వారం కలిసి వివరిస్తానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. శనివారం భువనగిరిలో రాయగిరి నిర్వాసితులు ఎంపీ వెంకట్‌రెడ్డిని కలిసి తమ గోడు విన్నవించుకున్నారు. వారితో ఎంపీ మాట్లాడుతూ.. కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ సోమవారం మధ్యా­హ్నం అపాయింట్‌మెంట్‌ ఇచ్చారని, ఆయ­నతో రీజినల్‌ రింగ్‌రోడ్డు సమస్యలపై చర్చిస్తానని చె­ప్పా­­రు.

రాయగిరితోపాటు పలుచోట్ల్ల త్రిబుల్‌ ఆర్‌ అలైన్‌మెంట్‌ మార్చాలని వినతులు వచ్చినట్లు చెప్పారు. కేంద్రమంత్రిని కలిసి స్థానిక సమస్యలు తెలిపి అలైన్‌మెంట్‌ మార్చే విధంగా చూస్తానని కోమటిరెడ్డి హామీ ఇచ్చారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement