కొత్తగా ఐదు కరోనా కేసులు | Telangana Logs 5 New Covid 19 Cases | Sakshi
Sakshi News home page

కొత్తగా ఐదు కరోనా కేసులు

Jan 5 2023 4:14 AM | Updated on Jan 5 2023 10:15 AM

Telangana Logs 5 New Covid 19 Cases - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో బుధవారం 5,495 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో ఐదుగురు వైరస్‌ బారినపడ్డారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8.41 లక్షలకు చేరింది. ఒక్కరోజులో కరోనా నుంచి 12 మంది కోలుకోగా, ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 8.37 లక్షలకు చేరింది.

ప్రస్తుతం 60 మంది ఐసోలేషన్‌ లేదా చికిత్స పొందుతున్నట్లు ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు వెల్లడించారు. కాగా, రాష్ట్రంలో బుధవారం 3,944 మందికి కరోనా వ్యాక్సిన్లు ఇచ్చారు. అందులో బూస్టర్‌ డోసు 3,276 మందికి వేయగా, రెండో డోసు 427 మందికి, మొదటి డోసు 241 మందికి వేసినట్లు ఆయన తెలిపారు.    

Advertisement
 
Advertisement
Advertisement