తెలంగాణలో పలువురు ఐపీఎస్‌ల బదిలీ | Telangana Govt Transfers 12 IPS Officers | Sakshi
Sakshi News home page

తెలంగాణలో పలువురు ఐపీఎస్‌ల బదిలీ

Feb 12 2024 8:44 PM | Updated on Feb 12 2024 9:02 PM

Telangana Govt Transfers 12 IPS Officers - Sakshi

హైదరాబాద్‌: రాష్ట్రంలో 12 మంది ఐపీఎస్‌లు బదిలీ జరిగింది. ఈ మేరకు సోమవారం తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ సుధీర్‌బాబు బదిలీ కాగా, సుధీర్‌బాబును హైదరాబాద్‌ మల్టీజోన్‌ ఐజీగా నియమించారు. ఇక రాచకొండ సీపీగా తరుణ్‌జోషిని నియమించారు.

రామగుండం సీపీగా ఎం శ్రీనివాసులు, సైబరాబాద్‌ ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీగా జోయల్‌ డేవిస్‌, సీఐడీ డీఐజీగా నారాయణ నాయక్‌, టీఎస్‌ఆర్‌టీసీ విజిలెన్స్‌ ఎస్పీగా అపూర్వరావు, హైదరాబాద్‌ ఈస్ట్‌జోన్‌ డీసీపీగా గిరిధర్‌, హైదరాబాద్‌ సౌత్‌వెస్ట్‌ డీసీపీగా ఉదయ్‌కుమార్‌రెడ్డి, జోగులాంబ డీఐజీగా ఎల్‌ఎస్‌ చౌహాన్‌, హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీగా సాధన రష్మి, పోలీస్‌ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా మురళీధర్‌లు బాధ్యతలు చేపట్టనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement