ప్రభుత్వ ఉద్యోగులకు దసరా బొనాంజా! | Telangana Govt Orders issued for release of two DA installments | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఉద్యోగులకు దసరా బొనాంజా!

Oct 8 2026 6:14 AM | Updated on Oct 8 2026 6:14 AM

Telangana Govt Orders issued for release of two DA installments

రెండు డీఏల విడుదల ఉత్తర్వులు జారీ 

రెండు విడతల కింద 6.37% కరువు భత్యం పెంపు 

అక్టోబర్‌ జీతంతో కలిపి నవంబర్‌ 1న చెల్లింపు 

ప్రభుత్వంపై ఏటా రూ.2,400 కోట్ల అదనపు భారం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ‘దసరా కానుక’ప్రకటించింది. రెండు విడతలకు సంబంధించిన కరువు భత్యం (డీఏ) విడుదల చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా జీవోలు జారీ చేశారు. 2024 జనవరి 1 నుంచి వర్తించే డీఏ పెంపునకు సంబంధించి జీఓ 128, 2024 జూలై 1కి సంబంధించి జీఓ 130 వేర్వేరుగా విడుదల చేశారు.
  
⇒ 2024 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చే డీఏను రివైజ్డ్‌ పే స్కేల్‌ (ఆర్‌పీఎస్‌)–2020 ఉద్యోగుల మూలవేతనంలో 33.67 శాతం నుంచి 37.31 శాతానికి పెంచారు. అంటే 2024 సంవత్సరం తొలి ఆర్నెల్ల కాలానికి 3.64 శాతం పెరిగింది. 2015 ఆర్‌పీఎస్‌ ఉద్యోగులకు 73.34 శాతం నుంచి 78.06 శాతానికి, యూజీసీ/ఏఐసీటీఈ 2016 పే స్కేల్‌ ఉద్యోగులకు 46 శాతం నుంచి 50 శాతానికి, 2006 పే స్కేల్‌ ఉద్యోగులకు 230 శాతం నుంచి 239 శాతానికి డీఏను సవరించారు.  
⇒ 2024 జూలై 1 నుంచి ఆర్‌పీఎస్‌–2020 ఉద్యోగుల డీఏను 37.31 శాతం నుంచి 40.04 శాతానికి పెంచారు. అంటే 2024 రెండో ఆర్నెల్ల కాలానికి 2.73 శాతం పెరిగింది. 2015 పే స్కేల్‌ ఉద్యోగులకు 78.06 శాతం నుంచి 81.728 శాతానికి, యూజీసీ/ఏఐసీటీఈ 2016 పే స్కేల్‌ ఉద్యోగులకు 50 శాతం నుంచి 53 శాతానికి, 2006 పే స్కేల్‌ ఉద్యోగులకు 239 శాతం నుంచి 246 శాతానికి పెంచారు. 

వీఆర్‌ఏలకు రూ.100 పెంపు 
⇒ తాజాగా పెంచిన డీఏ జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌లు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లు, వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు, జిల్లా గ్రంథాలయ సంస్థలు, వర్క్‌చార్జ్‌ ఎస్టాబ్లి‹Ùమెంట్‌ ఉద్యోగులకు వర్తిస్తుంది. ఎయిడెడ్‌ విద్యాసంస్థలు, పాలిటెక్నిక్‌లు, విశ్వవిద్యాలయాల బోధన, బోధనేతర సిబ్బందికీ వర్తింపజేశారు. పార్ట్‌టైమ్‌ అసిస్టెంట్లు, వీఆర్‌ఏలకు ప్రభుత్వం సర్వీసులో క్రమబద్ధీకరించే వరకు నెలకు రూ.100 చొప్పున అదనపు పెంపును మంజూరు చేశారు. 
⇒ ఉద్యోగ, ఉపాధ్యాయులకు పెరిగిన డీఏను 2026 అక్టోబర్‌ నెల జీతంతో కలిపి నవంబర్‌ 1న ప్రభుత్వం చెల్లించనుంది. 2024 జనవరి 1 నుంచి 2026 సెపె్టంబర్‌ 30 వరకు ఉన్న బకాయిలను ఉద్యోగుల జీపీఎఫ్‌ ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుంది. 2027 జనవరి 31లోపు పదవీ విరమణ చేసే ఉద్యోగులకు రెండు డీఏలకు సంబంధించిన బకాయిలను వరుసగా 33, 27 సమాన వాయిదాల్లో నేరుగా చెల్లిస్తారు. 
⇒ కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్‌) ఉద్యోగుల డీఏ బకాయిల్లో 10 శాతం మొత్తాన్ని ప్రభుత్వ వాటాతో కలిపి ప్రాన్‌ ఖాతాల్లో జమ చేస్తారు. మిగిలిన 90 శాతం మొత్తాన్ని 2026 నవంబర్‌ 1 నుంచి వరుసగా 33, 27 సమాన నెలసరి వాయిదాల్లో చెల్లిస్తారు.  
⇒ జీహెచ్‌ఎంసీ, మార్కెట్‌ కమిటీ ఉద్యోగుల డీఏ వ్యయాన్ని ఆయా సంస్థల సొంత నిధుల నుంచే భరించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. మృతి చెందిన ఉద్యోగుల చట్టబద్ధ వారసులకు బకాయిలను ఒకేసారి చెల్లిస్తారు. తాజాగా పెంచిన డీఏతో రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా రూ.2,400 కోట్ల అదనపు భారం పడనుంది. 

ప్రభుత్వానికి కృతజ్ఞతలు: టీజీఈజేఏసీ 
ఉద్యోగులకు రెండు డీఏలు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంపై తెలంగాణ ఉద్యోగుల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ చైర్మన్‌ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్‌ ఏలూరి శ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగులు, పెన్షనర్ల డీఏల సమస్యను పరిష్కరించే దిశగా నిర్ణయం తీసుకున్నందుకు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, సీఎస్‌ సంజయ్‌ జాజు, ఉన్నతాధికారులకు టీజీఈజేఏసీ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. మిగిలిన పెండింగ్‌ డీఏలను కూడా త్వరగా విడుదల చేయాలని.. పీఆర్సీ నివేదిక, ఫిట్‌మెంట్‌ 51% అమలు, బకాయిలకు సంబంధించి ప్రతి నెలా ఇస్తున్న రూ.వెయ్యి కోట్లను రూ.2 వేల వేల కోట్లకు పెంచడం వంటి డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. 

హైలైట్‌ చేయడం కోసం.. 
– 2024 జనవరి 1 నుంచి 2026 సెపె్టంబర్‌ 30 వరకు ఉన్న బకాయిలను ఉద్యోగుల జీపీఎఫ్‌ ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుంది. 2027 జనవరి 31లోపు పదవీ విరమణ చేసే ఉద్యోగులకు రెండు డీఏలకు సంబంధించిన బకాయిలను వరుసగా 33, 27 సమాన వాయిదాల్లో నేరుగా చెల్లిస్తారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement