సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ రూ.1.02 కోట్ల ప్రమాద బీమా అందించనున్నట్టు తెలిపింది. ప్రభుత్వ నిర్ణయంతో 5.14 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ కుటుంబాలకు ప్రయోజనం కలుగనుంది.
అయితే, ఇప్పటికే సింగరేణి, ట్రాన్స్‌కో, జెన్‌కో ఉద్యోగులకు కోటికి పైగా బీమా అందుతోంది. అదే తరహాలో అందరు ప్రభుత్వ ఉద్యోగులకు రూ.1.02 కోట్ల ప్రమాద బీమా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో 5.14 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ కుటుంబాలకు బీమా ప్రయోజనం కలుగనుంది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నాం. ప్రభుత్వ పథకాలను ఇంటింటికి చేర్చే ఉద్యోగులు మా కుటుంబ సభ్యులు అని చెప్పుకొచ్చారు.


