
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ శుక్రవారం రాజ్ భవన్‌లో ఈ-ఆఫీస్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజ్‌భవన్ ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటుందని, ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా ఉంటుందని తెలిపారు. ప్రతి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తానని తెలిపారు. రాజ్‌భవన్ ఎదుట కాంగ్రెస్ ఆందోళనపై గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర వ్యవసాయ చట్టాల్లో మంచి అంశాలున్నాయన్నారు. విపక్షాలకు, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యవసాయ చట్టాలపై భిన్న అభిప్రాయాలు ఉండొచ్చుని అభిప్రాయపడ్డారు. వ్యవసాయ చట్టాలతో రైతులకు లబ్ధి చేకూరుతుందని ఆశించారు. తెలంగాణ, తమిళనాడు నాకు రెండు కళ్లు. ప్రజాసేవ చేయడానికి సరిహద్దులు లేవు. ప్రస్తుతం తెలంగాణలో కోవిడ్ కంట్రోల్‌లోనే ఉందన్నారు తమిళిసై. (చదవండి: దేశ ధాన్యాగారంగా తెలంగాణ)