తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు | Telangana government transfers 36 DSPs, issues fresh postings | Sakshi
Sakshi News home page

తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు.. డీజీపీ సీవీ ఆనంద్‌ ఉత్తర్వులు

Jun 29 2026 5:13 PM | Updated on Jun 29 2026 5:20 PM

Telangana government transfers 36 DSPs, issues fresh postings

సాక్షి,హైదరాబాద్: తెలంగాణ పోలీస్ శాఖలో భారీగా బదిలీలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 36 మంది డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్  అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌ సోమవారం (జూన్ 29) అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ బోర్డు చేసిన సిఫార్సుల మేరకు ఈ బదిలీల ప్రక్రియ జరిగినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తాజా బదిలీల్లో ప్రధానంగా గత కొంతకాలంగా ఎలాంటి పోస్టింగ్స్ లేక హెడ్‌క్వార్టర్స్‌లో వెయిటింగ్‍లో ఉన్న 28 మంది సివిల్ డీఎస్పీ అధికారులకు కొత్త స్థానాలను కేటాయించారు. బదిలీ అయిన అధికారులను సీఐడీ, ఏసీబీ, ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్, వివిధ జిల్లాల ఏసీపీ పోస్టులతో కూడిన కీలక విభాగాల్లో నియమించారు. బదిలీ అయిన అధికారులు అందరూ తక్షణమే తమకు కేటాయించిన కొత్త స్థానాల్లో బాధ్యతలు స్వీకరించాలని డీజీపీ ఆదేశించారు  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement