సీఎం రేవంత్‌రెడ్డికి ఊరట | Telangana CM Revanth Reddy Get Relief In Huzurabad Byelection Case | Sakshi
Sakshi News home page

సీఎం రేవంత్‌రెడ్డికి ఊరట

Jun 5 2026 7:32 AM | Updated on Jun 5 2026 8:57 AM

Telangana CM Revanth Reddy Get Relief In Huzurabad Byelection Case

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి ఓ కేసులో నాంపల్లి ప్రజాప్రతి­నిధుల కోర్టు ఊరట ఇచ్చింది. ఆయన ఎలాంటి తప్పు చేయలేదని గుర్తించిన కోర్టు.. గురువారం ఆ కేసును కొట్టేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అసలేం జరిగిందంటే.. 

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక సమయంలో ప్రచారంలో కోవిడ్‌–19 నిబంధనలను పాటించలేదని సీఎం రేవంత్‌రెడ్డిపై 2021లో కమలాపూర్‌ పోలీసులు నమోదు చేశారు. నాడు ఎంపీ, పీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్‌రెడ్డికి కమలాపూర్‌లో ఎన్నికల ప్రచారానికి వెయ్యి మందితో సభకు పోలీసులు అనుమతి ఇవ్వగా, కోవిడ్‌–19 నిబంధనలను పాటించకుండా రెండువేల మందితో సభ నిర్వహించారని పోలీసులు ఐపీసీ సెక్షన్‌ 188 కింద కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై ఇంతకాలం ప్రజాప్రతినిధుల కోర్టు విచారణ జరిపింది. 

రేవంత్‌రెడ్డి తరఫున న్యా­­యవాది వాద­న­లు వినిపిస్తూ ప్రచార సమయంలో రేవంత్‌ అన్ని విధా­లుగా జాగ్ర­త్తలు పా­టిం­చారని, ఆయనను ఇబ్బందు­లకు గురి­చేయాలన్న దురుద్దేశంతో కేసులు నమోదు చేశారని చె­ప్పా­రు. రేవంత్‌ ఎ­లాంటి తప్పు చేయ­లేదని గుర్తించిన కోర్టు ఆయనపై నమోదైన కేసును కొట్టేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement