నేడు ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంలో విచారణ | Supreme Court Hearing In Mlas Disqualification Case Updates | Sakshi
Sakshi News home page

నేడు ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంలో విచారణ

Feb 18 2025 9:05 AM | Updated on Feb 18 2025 10:06 AM

Supreme Court Hearing In Mlas Disqualification Case Updates

కారు గుర్తుపై గెలిచి అధికార కాంగ్రెస్‌ పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేల కేసుపై మంగళవారం

సాక్షి, న్యూఢిల్లీ: కారు గుర్తుపై గెలిచి అధికార కాంగ్రెస్‌ పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేల కేసుపై మంగళవారం దేశ సర్వోన్నత న్యాయస్థానం మరోసారి విచారించనుంది. పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలపై త్వరగా చర్యలు తీసుకోవాలని కోరుతూ జనవరి 15న బీఆర్‌ఎస్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, దానం నాగేందర్‌లపై ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌ రెడ్డి, కేపీ వివేకానంద్‌లు స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ (ఎస్‌ఎల్పీ)ను దాఖలు చేశారు. మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎం.సంజయ్‌కుమార్, కాలె యాదయ్య, బండ్ల   కృష్ణమోహన్‌ రెడ్డి, ప్రకాశ్‌ గౌడ్, గూడెం మహిపాల్‌ రెడ్డి, అరెకపూడి గాంధీలపై బీఆర్‌ఎస్‌ పార్టీ, ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్, ఎమ్మెల్యే హరీశ్‌ రావు తదితరులు రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ రెండు పిటిషన్లపై ఈనెల 10న సుప్రీం కోర్టు విచారించింది. విచారణ సమయంలో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం.. రాజకీయ పారీ్టల హక్కులకు ఇబ్బంది కలుగుతుంటే చూస్తూ ఊరుకోం’అంటూ జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ వినోద్‌ చంద్రన్‌ల ధర్మాసనం పేర్కొంది. అనంతరం ఈనెల 18కి విచారణను వాయిదా వేసిన సంగతి తెలిసిందే.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement