ముగ్గురూ.. ముగ్గురే..!

strong leaders on Khairatabad Assembly constituency - Sakshi

రాజకీయ పరిపాలనానుభవం పుష్కలం... ప్రజలతో సంబంధాలు మెండు... నిత్యం ప్రజల మధ్యే తిరిగిన అనుభవం... ప్రతి గడపా గుర్తు పట్టేంతగా ముఖపరిచయం... అందరూ విద్యావంతులే... ఇదీ ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో మూడు ప్రధాన పారీ్టల నుంచి పోటీ పడుతున్న ముగ్గురు దిగ్గజ అభ్యర్థుల అనుభవాల పరంపర.  

బంజారాహిల్స్‌: ఇప్పటికే ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉన్న బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డితో పాటు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పని చేసిన బీఆర్‌ఎస్‌ అభ్యర్థి దానం నాగేందర్‌ వీరికి తోడు 2014లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అనుభవం ఉన్న కాంగ్రెస్‌ అభ్యర్థి పి.విజయారెడ్డి ఎవరికి వారే దిగ్గజ రాజకీయ నాయకులుగా నియోజకవర్గ ప్రజల్లో గత రెండు రోజుల నుంచి చర్చనీయాంశంగా మారారు. ఎక్కడ చూసినా ఈ ముగ్గురిపైనే ప్రధానంగా చర్చ జరుగుతోంది. 

హైదరాబాద్‌లో ఎక్కడా లేని విధంగా ముగ్గురు బలమైన అభ్యర్థులు పోటీ పడుతున్న నియోజకవర్గంగా ఖైరతాబాద్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా నిలిచింది. ఎవరికి వారే గట్టి అభ్యర్థులు కావడంతో పోటీ తీవ్రంగా ఉంటుందని గెలుపు ఎవరిదో స్పష్టంగా చెప్పలేని పరిస్థితులు ఉత్పన్నమయ్యాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

 కాంగ్రెస్‌ అభ్యర్థిగా విజయారెడ్డిని ప్రకటించడంతోనే నియోజకవర్గంలో అసలైన కదలిక వచి్చంది. నువ్వా.. నేనా అనే రీతిలో ఈ పోటీ జరగబోతోందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 

► విజయారెడ్డి దివంగత జనహృదయ నేత పీజేఆర్‌ వారసత్వాన్ని పునికిపుచ్చుకొని ప్రస్తుతం పోటీలో ఉండగా అయిదుసార్లు ఎమ్మెల్యేగా తలపడుతున్న దానం నాగేందర్‌కు ఇప్పుడామె సవాల్‌గా నిలిచారు. దీనికి తోడు చాపకింద నీరులా తమ క్యాడర్‌ను విస్తరించుకుంటూ ప్రజల్లోకి గత రెండేళ్లు నుంచి పాతుకుపోయిన బీజేపీ ఈ ఇద్దరు అభ్యర్థులకు గట్టిపోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకోవడానికి నియోజకవర్గంలో సమస్యలు కోకొల్లులుగా ఉన్నాయి.  

కేసీఆర్‌ బొమ్మతోనే...  
ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో అధికార పార్టీ సంక్షేమ పథకాలు ఎప్పుడూ లేని విధంగా లబ్ధిదారులకు అందాయి. కొన్ని చోట్ల అభివృద్ధి ఆగిపోయినా, చాలా చోట్ల దీర్ఘకాలంగా ఉన్న సమస్యలకు పరిష్కారం చూపారు. అయితే కేసీఆర్‌ బొమ్మతోనే ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపు బాటలో నిలవాల్సిందేనని నియోజకవర్గ ప్రజలు పేర్కొంటున్నారు. రకరకాల సమస్యలు బీఆర్‌ఎస్‌ అభ్యర్థని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా మంత్రి కేటీఆర్‌ రంగంలోకి దిగి ఒకసారి రోడ్డు మీదికి వస్తే పరిస్థితులో మార్పు వస్తుందని సర్వత్రా భావిస్తున్నారు. 

పీజేఆర్‌ బొమ్మతో... 
ఖైరతాబాద్‌ అంటేనే పీజేఆర్‌... పీజేఆర్‌ అంటేనే ఖైరతాబాద్‌... ఇప్పుడు ఈ నినాదాన్ని ఖైరతాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి విజయారెడ్డి ముమ్మరంగా ప్రజల్లోకి తీసుకెళ్లునున్నారు. ఇప్పటికీ పీజేఆర్‌కు అభిమానులు ఎక్కువగానే ఉన్నారు. ఆయన బొమ్మ చూస్తే ఓటర్లలో మార్పు రాకమానదు. దీనికి తోడు కాంగ్రెస్‌ పార్టీ అంటేనే పీజేఆర్‌ నరనరాన నిలిచిపోయింది. అదే పార్టీ తరపున ఆయన కూతురు పోటీ చేస్తుండటంతో నియోజకవర్గం ప్రజలు ఇప్పటికే స్వాగతిస్తున్నారు. కొంత కాలంగా ఆమె ప్రజల్లోనే తిరుగుతుండటంతో ఇప్పటికే నియోజకవర్గం మొత్తం ఆమె పరిచయం అయిపోయినట్లే.  

అధికార పార్టీ వైఫల్యాలే ఎజెండాగా...  
అయిదు సంవత్సరాల్లో అధికార పార్టీ వైఫల్యాలు తనకు అనుకూలిస్తాయని వాటిని ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లాలని బీజేపీ అభ్యర్ఙి చింతల రామచంద్రారెడ్డ ఎజెండా రూపొందించుకున్నారు. కేవలం ఎన్నికల సమయంలోనే కాకుండా గత నాలుగేళ్లుగా ఆయన ప్రజల చుట్టే తిరుగుతున్నారు కరోనా సమయంలో జనంలో తిరగడంతో అది బాగా కలిసి వస్తుందని ఆయన భావిస్తున్నారు. ముఖ్యంగా అభివృద్ధి చాలా చోట్ల నిలిచిపోవడంతో వాటినే 
అ్రస్తాలుగా మలుచుకోనున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

14-11-2023
Nov 14, 2023, 14:23 IST
కేసీఆర్‌కు ఏం పని లేదు. ప్రజలు కట్టిన పన్నులు రైతు బంధు ఇచ్చి దుబారా చేస్తున్నడని..
14-11-2023
Nov 14, 2023, 13:50 IST
సాక్షి, మహబూబ్‌నగర్‌: నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేటలో శనివారం అర్ధరాత్రి బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ శ్రేణుల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు...
14-11-2023
Nov 14, 2023, 13:15 IST
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ఎన్నికల్లో తొలిఘట్టం నామినేషన్ల పర్వం ముగియడంతో పాలమూరులో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు ప్రచారం ముమ్మరం...
14-11-2023
Nov 14, 2023, 12:49 IST
హైదరాబాద్: గత కొనేళ్లుగా వంటింట్లో మంట పుట్టిస్తున్న వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర తగ్గింపుపై పార్టీల ఎన్నికల హామీలు ఊరట...
14-11-2023
Nov 14, 2023, 12:48 IST
సాక్షిప్రతినిధి, ఖమ్మం: చాలా విషయాల్లో తుమ్మల నాగేశ్వరరావు బ్యాలెన్స్‌ తప్పాడని, ఇప్పుడు ఆయనకు ఓటమి కళ్ల ముందు కనిపిస్తుండడంతో భయం...
14-11-2023
Nov 14, 2023, 12:14 IST
సాక్షి, జగిత్యాల: నేను మీవాడిని.. ఎప్పటికీ మీ వెంటే ఉంటానని బీఆర్‌ఎస్‌ కోరుట్ల అభ్యర్థి డా.సంజయ్‌ అన్నారు. సోమవారం కోరుట్లలోని పట్టణంలోని...
14-11-2023
Nov 14, 2023, 12:05 IST
సాక్షి, హైదరాబాద్‌ ః కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ఏమో గానీ ఆరు నెలల కొకసారి సీఎం మారటం మాత్రం పక్కా అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌...
14-11-2023
Nov 14, 2023, 11:53 IST
సాక్షి, జోగులాంబ: అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల నామినేషన్ల పరిశీలనలో దూమారం రేగింది. బీఆర్‌ఎస్‌ అభ్యర్ధి నామినేషన్‌పై ఇతర పార్టీల...
14-11-2023
Nov 14, 2023, 11:40 IST
సాక్షి, యాదాద్రి : అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు డబ్బు కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల...
14-11-2023
Nov 14, 2023, 10:51 IST
కొల్లాపూర్‌: ఎన్నికల్లో ఎత్తులకు పై ఎత్తులు.. ఓటర్లను తికమక పెట్టే చర్యలు సహజంగా మారిపోయాయి. కొల్లాపూర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఇవి...
14-11-2023
Nov 14, 2023, 10:25 IST
సాక్షి, కరీంనగర్: 'అన్నా.. తమ్మీ.. నామినేషన్‌ వేశావు.. ఈ 15 రోజుల్లో ప్రచారం చేసి, నువ్వు గెలిచేది లేదు.. ఏ ఉద్దేశంతో నామినేషన్‌...
14-11-2023
Nov 14, 2023, 10:11 IST
సాక్షి, ఖమ్మం: శాసనసభ సాధారణ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన పూర్తికాగా, బరిలో మిగిలే అభ్యర్థులెవరో 15వ తేదీన తేలనుంది....
14-11-2023
Nov 14, 2023, 10:01 IST
సాక్షి, మహబూబాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గ అభ్యర్థి సింగపురం ఇందిర తన నామినేషన్‌తో పాటు దాఖలు చేసిన అఫిడవిట్‌లో తప్పిదం...
14-11-2023
Nov 14, 2023, 09:22 IST
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన వారికి వచ్చే ఓట్లు తమకు నష్టం చేస్తాయా? మేలు చేస్తాయా? వారు...
14-11-2023
Nov 14, 2023, 08:09 IST
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల పరిధిలో నామినేషన్ల పరిశీలన (స్క్రూట్నీ) సోమవారం పూర్తయింది. ఈ...
14-11-2023
Nov 14, 2023, 08:04 IST
సాక్షి, కరీంనగర్‌: ఒకప్పుడు చాలా మంది నాయకులు స్వతంత్ర అభ్యర్థులుగా అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగి, సత్తా చాటేవారు. ఉమ్మడి కరీంనగర్‌...
14-11-2023
Nov 14, 2023, 05:21 IST
సాక్షి, హైదరాబాద్‌: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు బీజేపీ కట్టుబడి ఉందని, వర్గీకరణను అమలు చేసే బాధ్యతను భుజస్కంధాలపై పెట్టుకుందని కేంద్రమంత్రి,...
14-11-2023
Nov 14, 2023, 05:13 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికల నామినేసన్ల పరిశీలన ప్రక్రియ సోమవారంతో ముగిసింది. రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల...
14-11-2023
Nov 14, 2023, 05:03 IST
సాక్షి, హైదరాబాద్‌:  తెలంగాణ ప్రజలకు ‘మోదీ గ్యారంటీలు’పేరిట భరోసా కల్పించేందుకు బీజేపీ నాయకత్వం సిద్ధమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ వర్గాల...
14-11-2023
Nov 14, 2023, 05:01 IST
ఎన్నికల ప్రచారంలో వాడీవేడి కొటేషన్లు ‘‘నాకు ఏం మాట్లాడినా పంచ్‌ ఉండాలంతే.. పంచ్‌ లేకుంటే కుదరదంతే’ అని ’ఆర్య’ సినిమాలో సునీల్‌... 

Read also in:
Back to Top