అగ్నిపథ్‌: రాకేశ్‌ అంతిమ యాత్రలో ఉద్రిక్తత..  | Stone Attack On BSNL Office In Warangal | Sakshi
Sakshi News home page

అగ్నిపథ్‌: రాకేశ్‌ అంతిమ యాత్రలో ఉద్రిక్తత.. BSNL ఆఫీసుపై రాళ్ల దాడి

Jun 18 2022 11:15 AM | Updated on Jun 18 2022 2:39 PM

Stone Attack On BSNL Office In Warangal - Sakshi

సాక్షి, వరంగల్‌: అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా శుక‍్రవారం సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ఆందోళనలు జరిగాయి. ఇందులో భాగంగా దాడులు జరిగిన విషయం తెలిసిందే. దాడుల నేపథ్యంలో ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరపడంతో వరంగల్‌కు చెందిన రాకేశ్‌ మృతిచెందాడు.

కాగా, వరంగల్‌ ఎంజీఎం నుంచి స్వగ్రామానికి శనివారం ఉదయం రాకేశ్ అంతిమ యాత్ర ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నేతలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.  అంతిమ యాత్ర కొనసాగుతుండగా ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. అంతిమ యాత్రలో పాల్గొన్న ఆందోళనకారులు.. ఒక్కసారిగి వరంగల్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్‌(BSNL) ఆఫీసుపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. అనంతరం ఆఫీసుకు నిప్పు పెట్టే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు అప్రమత్తమై వారిని అదుపులోకి తీసుకున్నారు.

ఇది కూడా చదవండి: సికింద్రాబాద్‌ విధ్వంసంపై ఇలా ప్లాన్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement