Banjara Hills: వ్యభిచార గృహంలో స్పై కెమెరా | spy camera found in banjara hills | Sakshi
Sakshi News home page

Banjara Hills: వ్యభిచార గృహంలో స్పై కెమెరా

Jun 24 2026 12:29 PM | Updated on Jun 24 2026 12:34 PM

spy camera found in banjara hills

హైదరాబాద్‌: ఓ వ్యభిచారగృహంలో నిర్వాహకురాలు స్పై కెమెరా బిగించింది. పోలీసులు దాడుల్లో ఈ విషయం వెలుగు చూసింది. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 10 జహీరానగర్‌లోని మైహోమ్‌ అపార్ట్‌మెంట్‌ ప్లాట్‌ నంబర్‌ 302లో వ్యభిచారం జరుగుతోందని బంజారాహిల్స్‌ ఎస్సై నవీన్‌కు విశ్వసనీయ సమాచారం అందింది.

సిబ్బందితో కలిసి ఆయన మంగళవారం దాడి చేసి మేనేజర్‌ శిరీష, మరో యువతిని అదుపులోకి తీసుకున్నారు. బెడ్‌రూమ్‌లో స్పై కెమెరా అమర్చి ఉండటాన్ని పోలీసులు గమనించారు. ఫుటేజీ ద్వారా ఏం చేస్తున్నారనే విషయంపై ఆరా తీస్తున్నారు. నిర్వాహకురాలు స్నేహగౌడ్‌ పరారీలో ఉంది. కేసు దర్యాప్తులో ఉంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement