ఫోన్ వస్తే ఇంటికెళ్లి సాయం

హైదరాబాద్: ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరైనా అనారోగ్యం బారిన పడితే ఎంతటి దగ్గర వారైనా, బంధువులైనా ముఖం చాటేస్తున్న రోజులివి. సహాయం చేయడం దేవుడెరుగు కనీసం మానవత్వం చూపడం లేదు. మాయదారి రోగం కరోనా ఎన్నో కుటుంబాలను కాకవికలం చేసింది. చాలా మంది, కరోనా బాధితులను అంటరాని వారిలా చూడటం, సమాజం నుండి వెలి వేసినట్లు చూస్తున్నారు. కానీ.. కొంత మంది మాత్రం కరోనా రోగుల పట్ల, లాక్‌డౌన్‌లో ఉపాధి కోల్పోయిన వారితో మమేకమవుతూ సహాయ పడుతూ పలువురిలో చైతన్యం కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. గాజులరామారం డివిజన్ చిత్తారమ్మదేవి నగర్‌కు చెందిన ఎస్పీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ శొంఠిరెడ్డ పున్నారెడ్డి సేవలు పరంపర కొనసాగుతున్నాయి.
నా పేరు శొంఠిరెడ్డి పున్నారెడ్డి. పేద ప్రజలకు తన వంతు సహాయం అందజేయడానికి శొంఠిరెడ్డి పున్నారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ (ఎస్పీఆర్ ట్రస్ట్)ను స్థాపించాను. అప్పటి నుంచి ఉచిత వైద్య సేవలు, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, పేద విద్యార్థులను అక్కున చేర్చుకోవడం, పేదలకు వైద్యం కోసం ఆరి్థక సహాయం, అన్నదానం, ప్రార్థన మందిరాల నిర్మాణానికి చేయూత, చెట్లు నాటడం వంటి ఎన్నో కార్యక్రమాలు చేశాను. గత సంవత్సరం కరోనా మొదటి వేవ్‌లో ట్రస్ట్ ద్వారా రూ. 25 లక్షలు వెచ్చించి 15 వేల పేద కుటుంబాలకు 9 రకాలతో కూడిన నిత్యావసర సరుకులు అందించాం.
కరోనా సెకండ్ వేవ్‌లో ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదని టోల్ ఫ్రీ నెంబర్ 7997995252 ను ఏర్పాటు చేసి మేలో వెయ్యి కుటుంబాలకు పైగా సరుకులు అందజేశాం. మాకు కాల్ వచ్చిన వెంటనే మా ట్రస్ట్ సభ్యులు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు 50 కుటుంబాలకు నేరుగా వారి ఇళ్ల వద్దకే వెళ్లి సరుకులు అందిస్తున్నాం. ఇప్పటి వరకు ట్రస్ట్ ఆధ్వర్యంలో 10 వేల మాసు్కలు, 10 వేల శానిటైజర్లు అందించాం. అంతే కాక మురికివాడ ప్రాంతాల్లో దోమల బెడద తొలగించడానికి ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిరోజు రెండు బస్తీల్లో రూ.3 వేలు ఖర్చుచేసి ఫాగింగ్ చేయిస్తున్నాం.
ఇక్కడ చదవండి: సేవలో ‘అగర్వాల్ బంధు’
నేనున్నానని...ఇంటి ఖర్చులను తగ్గించుకొని
మరిన్ని వార్తలు