ఎడమ కంటికి బదులు కుడికన్నుకు ఆపరేషన్‌ | Sircilla Eye Surgery Incident | Sakshi
Sakshi News home page

ఎడమ కంటికి బదులు కుడికన్నుకు ఆపరేషన్‌

Oct 6 2026 11:12 AM | Updated on Oct 6 2026 11:22 AM

Sircilla Eye Surgery Incident

సిరిసిల్లటౌన్‌: సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు కంటి ఆస్పత్రి వైద్యులు ఎడమ కంటికి చేయాల్సిన ఆపరేషన్‌ కుడికంటికి చేశారు. హాస్పిటల్‌ యాజమా న్యం ఆ తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేయడంతో బాధిత కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేసింది. వైద్యుల నిర్లక్ష్యంపై బాధిత కుటుంబీకులు సోమవా రం ఆందోళనకు దిగారు. పట్టణానికి చెందిన కొమ్ము వెంకమ్మ కంటి చూపు సమస్యతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు సెప్టెంబర్‌ 28న స్థానిక ఓ కంటి ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు శస్త్రచికిత్స అవసరమని సూచించారు.

 వెంకమ్మకు షుగర్‌ లెవెల్స్‌ అధికంగా ఉండటంతో తగ్గిన తరువాత రావాలని తెలపడంతో, సోమవారం వెళ్లగా అడ్మిట్‌ చేసుకొని ఎడమ కంటికి ఆపరేషన్‌ చేయడానికి థియేటర్‌లోకి తీసుకెళ్లారు. శస్త్రచికిత్స పూర్తయిన తర్వాత వెంకమ్మను బయట కు తీసుకురాగా.. కుడి కంటికి ఆపరేషన్‌ చేసి ఉండటంతో కుటుంబ సభ్యులు వైద్యులతో వాగ్వాదానికి దిగారు. ఉన్నతాధికారులు సరైన విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

ఈ ఘటనపై ఆస్పత్రి నిర్వాహకురాలు మణిచందన మాట్లాడుతూ.. వెంకమ్మకు రెండు కళ్లలోనూ చూపు సమస్య ఉందని, రెండు నేత్రాలకు ఆపరేషన్‌ చేయాలని కుటుంబ సభ్యులకు ముందుగానే చెప్పామన్నారు. శస్త్రచికిత్స విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం జరగలేదని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement