రామగుండం వైద్యకళాశాలకు రూ.500 కోట్లు

Singareni Coal Mining Corporation Sanctioned Rs 500 Crore For Medical College At Ramagundam - Sakshi

కేటాయిస్తూ ఇటీవల సింగరేణి బోర్డు నిర్ణయం 

100వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆమోదముద్ర  

రెండేళ్లలో పూర్తికానున్న ఆస్పత్రి నిర్మాణం

సాక్షి, హైదరాబాద్‌: రామగుండంలో వైద్యకళాశాల ఏర్పాటుకు సింగరేణి బొగ్గుగనుల సంస్థ రూ.500 కోట్లు మంజూరు చేసింది. ఈనెల 10న జరిగిన సంస్థ బోర్డు సమావేశం లో ఈ మేరకు నిర్ణయం తీసుకోగా, తాజాగా సోమవారం కొత్తగూడెంలో జరిగిన సంస్థ 100వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆమోదముద్ర వేసింది. రామగుండంలో వైద్యకళాశాల ఏర్పాటు చేసి స్థానికులు, కార్మికులకు సూపర్‌ స్పెషాలిటీ వైద్యసేవలు అందుబాటులోకి తెస్తామని రెండేళ్ల కింద శ్రీరాంపూర్‌ ఏరియాలో జరిగిన సింగరేణీయుల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ ఇచ్చారు.

తాజా నిర్ణయంతో సీఎం హామీ మేరకు వైద్య కళాశా ల, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఇటీవల జరిగిన ఓ సమీక్షలో వైద్యకళాశాల ఏర్పాటుకు రూ. 500 కోట్లు కేటాయించాలని సీఎం సూచిం చగా, ఆ మేరకు చర్యలు తీసుకున్నట్టు సింగరేణి యాజమాన్యం తెలిపింది. హైదరాబాద్‌ వంటి నగరాల్లో లభించే అన్ని రకాల సూపర్‌ స్పెషాలిటీ వైద్యవిభాగాలను రామగుం డంలో అందుబాటులోకి తీసుకువస్తున్నా మని వెల్లడించింది.

సింగరేణి కార్మికులు, రిటైర్డ్‌ కార్మికులు, వారి కుటుంబాలతోపాటు పెద్దపల్లి, మంచిర్యాల, భూపాలపల్లి, కొమురం భీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లాల ప్రజల కు సూపర్‌ స్పెషాలిటీ వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి. రెండేళ్లలో వైద్య కళాశాల, ఆస్పత్రి నిర్మాణం పూర్తి చేయాల ని నిర్ణయించారు. ఈ ప్రాంత విద్యార్థులకు ఒక ప్రభుత్వ వైద్య కళాశాల అందుబాటులో ఉండాలన్న కార్మికుల, స్థానికుల చిరకాల కోరిక మరో రెండేళ్లలో సాకారం కానుందని సంస్థ తెలిపింది. ఈ నిర్ణయం తీసుకున్నం దుకు గాను సీఎం కేసీఆర్‌కు సింగరేణి సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ కృతజ్ఞతలు తెలిపారు.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top