రాయదుర్గం భూములపై సర్కార్‌కు ఎదురుదెబ్బ.. ప్రభుత్వ రీకాల్‌ పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు 

Setback For Telangana Govt On Raidurgam Lands - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాయదుర్గం భూములపై సర్కార్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ప్రైవేట్‌ వ్యక్తులు తప్పుడు పత్రాలు సృష్టించి.. కోర్టును తప్పుదోవ పట్టించారని ఉత్తర్వులను వెనక్కు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయ్‌దుర్గం గ్రామంలోని సర్వే నంబర్‌ 46లోని 84 ఎకరాల 30 గుంటల భూమిపై ప్రైవేట్‌ వ్యక్తులు తప్పుడు పత్రాలతో హక్కులు పొందారని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో వాదనలు వినిపించింది. ఈ భూ ములకు సంబంధించి ఏప్రిల్‌లో ఇచ్చిన తీర్పును వెనక్కి తీసుకోవాలని కోరుతూ ప్రభుత్వం పిటిషన్‌దాఖలు చేసింది.

ఈ పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్‌ శ్రీదేవి, జస్టిస్‌ ప్రియదర్శిని ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయ వాది సీఎస్‌ వైద్యనాథన్‌వాదనలు వినిపించారు. విచారణ అర్హతను మాత్రమే సమీక్షిస్తా మని చెప్పిన హైకోర్టు 84 ఎకరాల భూమిపై హక్కులు ఇస్తూ తీర్పునిచి్చందన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ వాదనను వినాల్సి ఉండ గా, ఆ అవకాశం ఇవ్వలేదని చెప్పారు. ప్రైవేట్‌ వ్యక్తులు తప్పుడు పత్రాలను కోర్టుకు సమ ర్పించారని వెల్లడించారు. ప్రైవేట్‌ వ్యక్తులు లింగయ్య, మరికొందరి తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. రీకాల్‌ పిటిషన్‌పై విచారణ సరికాదన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టివేసింది. కాగా, దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్తామని రాజేంద్రనగర్‌ ఆర్డీవో చంద్రకళ పేర్కొన్నారు.
చదవండి: సీఎం ఫాంహౌస్‌ కోసమే ‘రీజినల్‌’ అలైన్‌మెంట్‌ మార్పు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top