
సాక్షి, హైదరాబాద్: సీనియర్ నిర్మాత ఆర్.వి.గురుపాదం కన్నుమూశారు. శనివారం ఉదయం గుండెపోటు రావడంతో బెంగళూరులోని తన స్వగృహంలో ఆయన తుదిశ్వాస విడిచారు.
గురుపాదం తెలుగు, తమిళ, కన్నడం, హిందీ భాషల్లో దాదాపు 25 సినిమాలను నిర్మించారు. ఎన్టీఆర్, కృష్ణతో ‘వయ్యారి భామలు వగలమారి భర్తలు’, కృష్ణంరాజు, చిరంజీవితో ‘పులి బెబ్బులి’చిత్రాలు తీశారు. ‘తిరుపతిక్షేత్ర మహత్యం’, జితేంద్ర, శ్రీదేవి హీరోహీరోయిన్లుగా హిందీలో ‘అకల్‌మంద్’(1984) చిత్రాలను నిర్మించారు.