పూర్తయిన 692 స్పెషలిస్ట్‌ డాక్టర్ల ఎంపిక | Selection of 692 specialist doctors completed | Sakshi
Sakshi News home page

పూర్తయిన 692 స్పెషలిస్ట్‌ డాక్టర్ల ఎంపిక

Apr 7 2026 4:29 AM | Updated on Apr 7 2026 4:29 AM

Selection of 692 specialist doctors completed

నేడు నియామకపత్రాలు అందజేయనున్న ఆరోగ్య మంత్రి దామోదర రాజనర్సింహ

సాక్షి, హైదరాబాద్‌: డైరెక్టరేట్‌ ఆఫ్‌ సెకండరీ హెల్త్‌ కేర్‌ (టీవీవీపీ) పరిధిలోని ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న 692 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ (స్పెషలిస్ట్‌) పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తయింది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ ఆర్‌బీ) సోమవారం సాయంత్రం విడుదల చేసింది. ఈ నియామకాల్లో అనస్తీషియా 226, గైనకాలజీ 247, పీడి యాట్రిక్స్‌ 219 పోస్టులున్నాయి. మొత్తం 692 పోస్టులకు ఎంపిక పూర్తయింది. మంగళవారం (ఏప్రిల్‌ 7) వరల్డ్‌ హెల్త్‌ డే సందర్భంగా ఎంపికైన డాక్టర్లకు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ నియామక పత్రాలు అందజేయనున్నారు. 

గతేడాది ఎంహెచ్‌ఎస్‌ ఆర్‌బీ 1,616 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ (స్పెషలిస్ట్‌), 607 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అందులో భాగంగా గైనకాలజీ, అనస్తీషియా, పీడియా ట్రిక్స్‌ విభాగాలకు సంబంధించిన 692 పోస్టుల భర్తీ పూర్తవడంతో ఫలితాలు విడుదలయ్యా యి. మిగిలిన 924 స్పెషలిస్ట్‌ పోస్టుల భర్తీ ప్రక్రియ మే నెలలో పూర్తికానుంది. ఇక 607 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల్లో గైనకాలజీ, అనస్తీషియా, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్‌ విభా గాలకు చెందిన 174 పోస్టుల ఎంపిక ప్రక్రియ ఇటీవల పూర్తై, ఫలి తాలు విడుదలయ్యాయి.వీరికి కూడా నియామక పత్రాలు ఇవ్వనున్నారు. 

ఆరోగ్యశాఖలో ఖాళీల భర్తీపై దృష్టి సారించిన ప్రభుత్వంం గత రెండున్నరేళ్లలో డాక్టర్లు, నర్సింగ్‌ ఆఫీసర్లు, ల్యాబ్‌ టెక్నీషియన్లు వంటి 9,572 పోస్టులను భర్తీ చేసింది. ప్రస్తుతం మరో 7,562 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతుండగా, అందులో 866 పోస్టుల నియామకాలు కూడా తాజాగా పూర్తయ్యాయి. అలాగే 2,312 నర్సింగ్‌ ఆఫీసర్‌ పోస్టుల ఫలితాలు మరో వారం రోజుల్లో విడుదల చేయనున్నట్లు బోర్డు ఇప్పటికే ప్రకటించింది. దీంతో మొత్తం భర్తీ చేసిన పోస్టుల సంఖ్య 12,750కు చేరనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement