బాలికలకు ‘ప్రేమ్‌జీ’ స్కాలర్‌షిప్స్‌ | Scholarship for girls enrolled in graduation courses | Sakshi
Sakshi News home page

బాలికలకు ‘ప్రేమ్‌జీ’ స్కాలర్‌షిప్స్‌

Sep 24 2025 4:29 AM | Updated on Sep 24 2025 4:29 AM

Scholarship for girls enrolled in graduation courses

ఉన్నత విద్యలో చేరినవారికి ఏటా రూ.30 వేలు 

ఈ నెలాఖరు వరకు దరఖాస్తుల స్వీకరణ 

ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ వి.బాలకిష్టారెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: ఉన్నత విద్య అభ్యసించే బాలికలకు అజీమ్‌ జీ ప్రేమ్‌ ఫౌండేషన్‌ ఏటా రూ.30 వేల ఉపకార వేతనం అందిస్తోందని అజీమ్‌ ప్రేమ్‌జీ తెలంగాణ ప్రాంత బాధ్యుడు ఎం శ్రీనివాస్‌రావు, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ఫ్రొఫెసర్‌ బాలకిష్టారెడ్డి తెలిపారు. మంగళవారం వారు మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్యా సంస్థల్లో టెన్త్, ఇంటర్‌ చదివి గ్రాడ్యుయేషన్‌ కోర్సుల్లో చేరిన బాలికలకు ఈ స్కాలర్‌షిప్‌ అందిస్తారని వెల్లడించారు. డిప్లొమా, డిగ్రీ, ఇంజనీరింగ్, ఎంబీబీఎస్‌ చదివే బాలికలకు ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు. 

గ్రాడ్యుయేషన్‌లో చేరింది మొదలు కోర్సు పూర్తయ్యే వరకు ఏటా రూ.30 వేలు అందిస్తారని వివరించారు. అయితే, విద్యార్థులు తప్పనిసరిగా టెన్త్, ఇంటర్‌ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివి ఉండాలని తెలిపారు. 18 రాష్ట్రాల్లో 2.5 లక్షల మంది బాలికలకు తమ ఫౌండేషన్‌ స్కాలర్‌షిప్‌లు ఇస్తున్నట్టు శ్రీనివాసరావు వెల్లడించారు. 

బెంగళూరు, భోపాల్‌లో యూనివర్సిటీలు నిర్వహిస్తోందని చెప్పారు. మధ్యప్రదేశ్‌లో 1.26 లక్షల మంది, కర్ణాటకలో 88 వేల మంది స్కాలర్‌షిప్స్‌ కోసం దరఖాస్తు చేశారని, తెలంగాణలో 3,275 దరఖాస్తులు మాత్రమే వచ్చాయని పేర్కొన్నారు. బాలికల్లో ఈ పథకం పట్ల సరైన అవగాహన లేకపోవడమే ఇందుకు కారణమని అన్నారు.  

దరఖాస్తు చేయడం ఇలా... 
అజీమ్‌ ప్రేమ్‌జీ వెబ్‌సైట్‌ ద్వారా అర్హులైన వారు దరఖాస్తు చేయవచ్చు. తాజా పాస్‌పోర్టు సైజ్‌ ఫొటో, సంతకం, బ్యాంకు ఖాతా వివరాలు, టెన్త్, ఇంటర్‌ మార్కుల మెమో, ఆధార్‌ కార్డు, గ్రాడ్యుయేషన్‌ అడ్మిషన్‌ ఫీజు (బోనఫైడ్‌ లేదా ట్యూషన్‌ ఫీజు రసీదు)తో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. దీనికి ఎలాంటి ఫీజు ఉండదు. 

ఈ నెల 30వ తేదీలోగా దరఖాస్తులు పంపాలి. రెండో విడత దరఖాస్తుల ప్రక్రియను వచ్చే ఏడాది జనవరిలో ప్రా రంభిస్తారు. రాష్ట్రవాప్తంగా 15 వేల మంది విద్యారి్థనులకు స్కాలర్‌షిప్‌ అందిస్తారు. అ ర్హులను లాటరీ ద్వారా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాల కోసం 99630 28900 నంబర్‌లో సంప్రదించాలని ఫౌండేషన్‌ సూచించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement