
సిటీకి ఈయన 62వ పోలీసు కమిషనర్
మూడేళ్ల కాలంలో కమిషనర్లుగా ఐదుగురు
వీరిలో రెండుసార్లు పనిచేసిన ఆనంద్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌కు 62వ పోలీసు కమిషనర్‌గా విశ్వనాథ్ చెన్నప్ప సజ్జనర్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో (టీజీఐసీసీసీ) ఉన్న నగర పోలీసు కమిషనర్ కార్యాలయానికి వచ్చిన ఆయనకు పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తన చాంబర్‌లో సజ్జనర్ బాధ్యతలు తీసుకున్న అనంతరం సర్వమత ప్రార్థనలు జరిగాయి. టీజీఐసీసీసీ ఆవరణలో ఆయన శాంతి, స్వేచ్ఛకి సూచికంగా కొన్ని పావురాలను గాల్లోకి ఎగురవేశారు. కొత్త కొత్వాల్‌లు నగర పోలీసు విభాగంలో పని చేస్తున్న అధికారులు కలిసి అభినందించారు. బదిలీపై వెళ్తున్న సీవీ ఆనంద్ సైతం సజ్జనర్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.
అప్పట్లో అరుదైన ఘట్టాలు...
నగర పోలీసు కమిషనరేట్‌కు దాదాపు 150 ఏళ్ల చరిత్ర ఉంది. సుదీర్ఘకాలం నిజాం ఏలుబడిలో ఉన్న హైదరాబాద్ 1948 సెపె్టంబర్‌లో జరిగిన ఆపరేషన్ పోలోతో దేశంలో విలీనమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 62 మంది పోలీసు కమిషనర్లుగా (కొందరు రెండేసి సార్లు విధులు నిర్వర్తించారు) పని చేశారు. అయితే కేవలం రెండు సందర్భాల్లోనే ఒకే ఏడాదిలో ముగ్గురు కమిషనర్లుగా పనిచేశారు. 1990లో మాత్రం అప్పటి ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఏడాదిలో నలుగురు కమిషనర్లుగా బాధ్యతలు నిర్వర్తించారు. 1954 మే 14 వరకు ఈ స్థానంలో పని చేసిన ఎ.సుందరం పిళ్లై పదవీ విరమణ చేశారు. దీంతో ఆ మరుసటి రోజు బీఎల్ ఖేద్కర్ నగర కొత్వాల్‌గా బాధ్యతలు తీసుకుని సెప్టెంబర్ 25 వరకు పని చేసి రిటైర్ కావడంతో సి.రంగస్వామి అయ్యర్ పోలీసు కమిషనర్‌గా వచ్చారు.
1989 ఫిబ్రవరి 15 నుంచి 1990 మే 4 వరకు వి.అప్పారావు పోలీసు కమిషనర్‌గా పని చేసి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలోకి వచి్చన ఐ.పుల్లన్న అదే ఏడాది ఆగస్టు 15 వరకు విధులు నిర్వర్తించారు. మరుసటి రోజు బాధ్యతలు స్వీకరించిన జి.గుర్నాథ్‌రావు అదే ఏడాది నవంబర్ 28 వరకు.. ఆ తర్వాత ఎంవీ భాస్కర్‌రావు కొత్వాల్ అయ్యారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎనిమిదో సీపీ...
వీసీ సజ్జనర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్‌కు ఏడో సీపీ. 2014 నుంచి ఇప్పటి వరకు ఎనిమిది మంది మారగా...వీరిలో ఆనంద్ రెండుసార్లు పని చేశారు. తొలి కొత్వాల్ ఎం. మహేందర్‌రెడ్డి 2017 నవంబర్ 11న బదిలీ కావడంతో ఆయన స్థానంలో వీవీ శ్రీనివాసరావు 2017 నవంబర్ 12న బాధ్యతలు తీసుకున్నారు. ఈయన నుంచి అంజనీకుమార్ 2018 నవంబర్ 12న చార్జ్ తీసుకోవడం ఇద్దరూ ఒకే తేదీన బాధ్యతలు స్వీకరించిన వారయ్యారు. 2023 ఏడాది అక్టోబర్ 13న సందీప్ శాండిల్య..అదే ఏడాది డిసెంబర్ 13న కొత్తకోట శ్రీనివాసరెడ్డి స్వీకరించారు.
గత ఏడాది సెప్టెంబర్ 08న ఆయన్ను బదిలీ చేసిన సర్కారు సీవీ ఆనంద్‌ను మరోసారి పోలీసు కమిషనర్‌గా నియమించింది. ఆనంద్ సైతం బదిలీ కావడంతో మంగళవారం సజ్జనర్ బాధ్యతలు తీసుకున్నారు. ఇలా 2023–2025 మధ్య నగరానికి నలుగురు అధికారులు (సీవీ ఆనంద్ రెండుసార్లు) ఐదుసార్లు కొత్వాల్‌గా బాధ్యతలు స్వీకరించారు. గడిచిన కొన్నేళ్లల్లో హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా అతితక్కువ కాలం పని చేసింది సందీప్ శాండిల్య కావడం గమనార్హం.