సాలార్‌జంగ్‌ మ్యూజియంలో రౌడీషీటర్ల మేళా | Rowdy Sheeters Mela At Salar Jung Museum In Hyderabad | Sakshi
Sakshi News home page

‘31 మంది రౌడీషీటర్లకు కొత్త జీవితం’

Aug 3 2020 6:26 PM | Updated on Aug 3 2020 6:36 PM

Rowdy Sheeters Mela At Salar Jung Museum In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్: దీర్ఘ కాలంపాటు ఎలాంటి నేరాలు చేయకుండా బుద్ధిగా మెలిగిన 31 మంది రౌడిషీటర్లపై ఉన్న రౌడీషీట్లను పోలీసులు క్లోజ్‌ చేశారు. ఈ విషయాన్ని హైదరాబాద్‌ నగర కమిషనర్‌ అంజనీ కుమార్‌  వెల్లడించారు. పాతబస్తీ సౌత్ జోన్ పరిధిలో సత్ప్రవర్తన కలిగిన రౌడీషీటర్ల మేళా సాలార్ జుంగ్ మ్యూజియంలో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా సీపీ అంజనీ కుమార్‌ మాట్లాడుతూ... పాతబస్తీలో సత్ప్రవ్తన కలిగి నేరాలకు దూరంగా ఉన్న 31 మంది రౌడీ షీటర్ల పేర్లను పోలీస్ రికార్డుల్లోంచి తొలగించాం.

వీరంతా కొత్త జీవితాన్ని గడిపేందుకు అవకాశం కలిపించాం. గతంలో వీరంతా తప్పులు, నేరాలు చేసి జైలుకి వెళ్లిన వారు. కానీ, ఇప్పుడు బుద్ధిగా ఉంటున్నారు. వీరిపై ఉన్న రౌడీషీట్లు తొలగిపోవడంతో అందరికీ ఆదర్శంగా ఉంటూ కుటుంబంతో సంతోషంగా జీవించాలని కోరుతున్నా. సమాజంలో మంచిగా మెలగండి. బాధ్యతగా ప్రవర్తించండి. తిరిగి ఎలాంటి నేరాలకు పాల్పడినా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన మళ్లీ జైలుకు వెళతారు’అని సీపీ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement