HYD: రాయదుర్గంలో ఘోర రోడ్డు ప్రమాదం | Road Accident In Raidurgam Hyderabad | Sakshi
Sakshi News home page

HYD: రాయదుర్గంలో ఘోర రోడ్డు ప్రమాదం

Sep 15 2024 9:51 AM | Updated on Sep 15 2024 10:04 AM

Road Accident In Raidurgam Hyderabad

రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌ను తప్పించబోయి పక్కనే ఉన్న కారును ఆటో ఢీకొట్టింది.

సాక్షి, హైదరాబాద్‌: రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌ను తప్పించబోయి పక్కనే ఉన్న కారును ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ఒక మహిళ మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆటో డ్రైవర్‌కి తీవ్ర గాయాలయ్యాయి.

మృతి చెందిన మహిళ రత్న బాయ్ (43)గా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని ఉస్మానియాకు పోలీసులు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: గుళికల ప్యాకెట్‌ను తెచ్చిన కోతి.. టీ పొడి అనుకుని..

Advertisement
 
Advertisement
Advertisement