వారం రోజుల్లో పెళ్లి.. రోడ్డు ప్రమాదంలో తండ్రి, కూతురు మృతి | Road Accident In Hyderabad At Aramghar | Sakshi
Sakshi News home page

వారం రోజుల్లో పెళ్లి.. రోడ్డు ప్రమాదంలో తండ్రి, కూతురు మృతి

Sep 17 2026 7:00 AM | Updated on Sep 17 2026 7:29 AM

Road Accident In Hyderabad At Aramghar

సాక్షి, హైదరాబాద్‌: మరో వారం రోజుల్లో ఇంట్లో పెళ్లి బాజాలు మోగాల్సి ఉంది. పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న ఆ కుటుంబంలో అంతలోనే తీరని విషాదం నెలకొంది. పెళ్లి పనుల నిమిత్తం బైక్‌పై వెళ్తున్న తండ్రి, కూతురును కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్‌ ఢీకొట్టడంతో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన హైదరాబాద్‌లోని ఆరంఘర్‌ చౌరస్తా వద్ద గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

హయత్‌నగర్‌ నుంచి అత్తాపూర్‌ వైపు కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్‌.. బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న తండ్రి ఇస్మాయిల్‌ ఖాన్‌, కూతురు బురుషాన్‌ బేగం మృతి చెందారు. మరో వారం రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండగా, పెళ్లి పనుల కోసం బయలుదేరిన తండ్రీకూతుళ్లు ఇలా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి: వినాయక నిమజ్జనం వేళ విషాదం.. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement