Hyderabad: Rahul Gandhi Got Permission For Chanchalguda NSUI Leaders Mulaqat - Sakshi
Sakshi News home page

NSUI: చంచల్‌గూడ ములాఖత్‌కు రాహుల్‌ గాంధీకి అనుమతి.. రాహుల్‌తో పాటు ఆ ఇద్దరికే!

May 7 2022 10:30 AM | Updated on May 7 2022 11:04 AM

Rahul Gandhi Got Permission For Chanchalguda NSUL Leaders Mulaqat - Sakshi

చంచల్‌ గూడ జైల్లో ఉన్న ఎన్‌ఎస్‌యూఐ నేతలతో ములాఖత్‌ అయ్యేందుకు రాహుల్‌ గాంధీకి ఎట్టకేలకు అనుమతి లభించింది.

సాక్షి, హైదరాబాద్‌: చంచల్‌గూడ జైల్లో ఉన్న ఎన్‌ఎస్‌యూఐ నేతలను పరామర్శించేందుకు ఎట్టకేలకు కాంగ్రెస్‌ కీలక నేత రాహుల్‌ గాంధీకి అనుమతి దొరికింది. ములాఖత్‌కు అనుమతించాలని మరోసారి విజ‍్క్షప్తి చేయండంతో అధికారులు అంగీకరించారు. ఈ విషయాన్ని జైళ్ల శాఖ డీజీ జితేందర్‌ ధృవీకరించారు. 

రాహుల్‌తో పాటు రేవంత్‌ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్కలకు మాత్రమే అనుమతి ఇచ్చారు. శనివారం మధ్యాహ్నాం సమయంలో జైల్లో ఉన్న పద్దెనిమిది మంది ఎన్‌ఎస్‌యూఐ నేతలను ముగ్గురు కీలక నేతలు పరామర్శిస్తారు. 

ఓయూలో రాహుల్‌ గాంధీ పర్యటనకు అనుమతి నిరాకరణ నేపథ్యంలో కాంగ్రెస్‌ విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యూఐ నిరసనలు చేపట్టగా.. పోలీసులు వాళ్లందరినీ అరెస్ట్‌ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement