అర్వింద్‌పై బీజేపీ నేతల అసంతృప్తి.. నాంపల్లి కార్యాలయం ముట్టడికి పిలుపు | Protest against Jagtial BJP MP Arvind | Sakshi
Sakshi News home page

అర్వింద్‌పై బీజేపీ నేతల అసంతృప్తి.. నాంపల్లి కార్యాలయం ముట్టడికి పిలుపు

Aug 29 2026 9:30 PM | Updated on Aug 29 2026 9:32 PM

Protest against Jagtial BJP MP Arvind

సాక్షి, జగిత్యాల:  జిల్లా బీజేపీలో ఒక్కసారిగా విభేదాలు భగ్గుమన్నాయి. ఎంపీ అర్వింద్‌ వ్యవహారంపై స్థానిక జిల్లా నేతలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఈ అంశమై ఈ రోజు ( శనివారం) రేకుంటలో బీజేపీ కౌన్సిలర్లు, ముఖ్యనేతలు కీలక సమావేశం నిర్వహించారు. అర్వింద్‌ వ్యవహారశైలికి నిరసనగా హైదరాబాద్ నాంపల్లి బీజేపీ కార్యాలయ ముట్టడికి చేయాలని తీర్మానించారు. దీంతో జిల్లా కాషాయదళంలో లుకలుకలు ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి.

ఎంపీ అర్వింద్‌ జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ బోగ శ్రావణిని వెనుకేసుకురావడంపై నేతలంతా గుర్రుగా ఉన్నారు. ఈ విషయమై ఇదివరకే పార్టీ అధ్యక్షుడు రాంచందర్‌ రావుకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదు. దీంతో తీవ్ర అసహానం వ్యక్తం చేసిన నేతలు నాంపల్లి కార్యాలయ ముట్టడికి నిర్ణయం తీసుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement