కలకత్తా యువతులతో వ్యభిచారం | Sakshi
Sakshi News home page

ఫార్చూన్‌ లాడ్జిపై దాడి...24 మంది అరెస్టు

Published Sun, Jan 21 2024 7:39 AM

Prostitution Racket: Police arrest main organiser Paheliwan Akhilesh at Abids Hotel - Sakshi

అబిడ్స్‌: కలకత్తా నుంచి యువతులను తీసుకువచ్చి అబిడ్స్‌ ఫార్చూన్‌ లాడ్జిలో వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వాహకులు, యువతులు, విటులను నగర టాస్‌్కఫోర్స్, అబిడ్స్‌ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. హైటెక్‌ తరహాలో అందరి కళ్లుగప్పి వ్యభిచారం నిర్వహిస్తున్న వారందరిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అఖిలేష్‌ (36) (అఖిలేష్‌ ఫహిల్వాన్‌) అనే వ్యక్తి అబిడ్స్‌లో ఫార్చూన్‌ లాడ్జిని కొనసాగిస్తున్నాడు.

కొన్ని రోజులుగా కలకత్తా నుంచి యువతులను తీసుకువచ్చి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. సమాచారం అందుకున్న నగర సెంట్రల్‌జోన్‌ టాస్‌్కఫోర్స్‌ పోలీసులు, అబిడ్స్‌ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. లాడ్జి యజమాని అఖిలే‹Ù, మేనేజర్‌ రఘుపతి, 16 మంది యువతులు, 6 మంది విటులను అరెస్టు చేశారు. వీరిలో యువతులను తుక్కుగూడలోని రెస్క్యూహోమ్‌కు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్‌ నర్సింహరాజు తెలిపారు. మిగతా వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ కేసును అబిడ్స్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.   

Advertisement
 
Advertisement