40 శాతం వైకల్యమున్నామెజారిటీ కేటగిరీల్లో అర్హత | Procedures for distribution of equipment to the disabled have been finalized | Sakshi
Sakshi News home page

40 శాతం వైకల్యమున్నామెజారిటీ కేటగిరీల్లో అర్హత

Jun 6 2025 1:13 AM | Updated on Jun 6 2025 1:13 AM

Procedures for distribution of equipment to the disabled have been finalized

దివ్యాంగులకు పరికరాల పంపిణీకి విధివిధానాలు ఖరారు!

గత ఉత్తర్వులను సవరిస్తూ తాజాగా మార్గదర్శకాలు విడుదల

సీఎం రేవంత్‌రెడ్డికి టీవీసీసీ కృతజ్ఞతలు  

సాక్షి, హైదరాబాద్‌: దివ్యాంగుల సంక్షేమంలో భాగంగా తెలంగాణ వికలాంగుల కోఆపరేటివ్‌ కార్పొరేషన్‌ (టీవీసీసీ) ద్వారా పంపిణీ చేసే పరికరాలకు సంబంధించి విధివిధానాలు ఖరారయ్యాయి. ఈ పరికరాల పంపిణీలో గత ప్రభుత్వం నిబంధనలు జారీ చేసిన ప్పటికీ... క్షేత్రస్థాయి నుంచి వచ్చిన వినతులు, సలహాలు, సూచనలకు అనుగుణంగా టీవీసీసీ పాలకమండలి నిర్ణయం తీసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. ఈ నేపథ్యంలో టీవీసీసీ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదిస్తూ ఈ మేరకు తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. 

రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు, వికలాంగుల సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్‌ జీవో 89 జారీ చేశారు. ఈ నేప థ్యంలో గురువారం టీవీసీసీ చై ర్మన్‌ ముత్తినేని వీరయ్య ఉత్త ర్వుల కాపీలను విడుదల చేశా రు. ఈ సందర్భంగా ఆయన మలక్‌పేటలోని టీవీసీసీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం మీ డియాతో మాట్లాడారు. వినతు లను పరిగణించి పెద్ద సంఖ్యలో దివ్యాంగులకు లబ్ధి జరిగే విధంగా మార్పులు చేస్తూ చర్యలు తీసుకున్నందుకు సీఎం రేవంత్‌ రెడ్డికి ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. 

బెంచ్‌మా ర్క్‌ డిజేబిలిటీ ఉన్న ప్రతి దివ్యాంగుడికి తాజా నిబంధనలు వర్తిస్తాయని, గతంలో 80% వైకల్యం ఉన్న వాళ్లకు మాత్రమే అర్హత కల్పించగా... ప్రస్తుత ప్రజాప్రభుత్వం కుదించిందన్నారు. దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంతటి ఉదార నిర్ణయం తీసుకోలేదని వీరయ్య వ్యాఖ్యానించారు. 

40 శాతం వైకల్యం ఉంటే...
తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ ద్వారా మూడు చక్రాల మోటరైజ్డ్‌ వాహనాలు, వృత్తివిద్యా కోర్సులు చదువుతున్న దివ్యాంగ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, విద్యార్థి నేస్తం కార్యక్రమం ద్వారా ట్యాబ్‌లు, లూయిస్‌ బ్రెయిలె అండ్‌ హెలెన్‌ కిల్లర్‌ గిఫ్ట్‌గా 5జీ స్మార్ట్‌ ఫోన్లు, లెప్రసి బాధిత దివ్యాంగులకు మైక్రో సెల్యూలర్‌ రబ్బర్‌ (ఎంసీఆర్‌), అంధ విద్యార్థులకు బ్రెయిలీ కిట్లు, కుర్చీకే పరిమితమైన దివ్యాంగులకు ఇన్నోవేటివ్‌ బ్యాటరీ వీల్‌ చైర్స్, స్వయం ఉపాధి కింద వ్యాపారం చేసుకునే దివ్యాంగులకు బ్యాటరీ వెహికల్స్‌ అందిస్తున్నారు. వీటిలో మెజార్టీ కేటగిరీల్లో కేవలం 40 శాతం వైకల్యం ఉన్నా అర్హత సాధిస్తారని టీవీసీసీ చైర్మన్‌ ముత్తినేని వీరయ్య తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement