కేసీఆర్‌కు మరోసారి పవర్‌ కమిషన్‌ నోటీసులు | Power Commission Another Notice Issued On Kcr Over Power Purchase Issue | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌కు మరోసారి పవర్‌ కమిషన్‌ నోటీసులు

Jun 25 2024 6:46 PM | Updated on Jun 25 2024 7:43 PM

Power Commission Another Notice Issued On Kcr Over Power Purchase Issue

సాక్షి,హైదరాబాద్‌ : మాజీ సీఎం కేసీఆర్‌కు పవర్ కమిషన్ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకు కమిషన్‌కు వచ్చిన సమాచారంపై అభిప్రాయం చెప్పాలని నోటీసులో పవర్ కమిషన్ పేర్కొంది. ఈ నెల 27 లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కేసీఆర్‌తో పాటు జగదీష్ రెడ్డి, మరికొంత మందికి నోటీసులు పంపింది పవర్‌ కమిషన్‌. 

ఇప్పటికే యాదాద్రి,భద్రాద్రి విద్యుత్‌ కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్‌గఢ్ నుంచి కరెంటు కొనుగోలు ఒప్పందం అంశాల్లో తీసుకున్ననిర్ణయాలపై మాజీ సీఎం కేసీఆర్‌కు జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 15లోగా రాతపూర్వకంగా సమాధానాలు పంపాలని నిర్ధేశించింది. దీనిపై కేసీఆర్‌ స్పందిస్తూ జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డికి కేసీఆర్ 12 పేజీల సుధీర్ఘ లేఖ రాశారు.ఎలక్ట్రి సిటీ యాక్ట్ 2003ను అనుసరిస్తూ, వీటన్నింటికీ అవసరమైన కేంద్ర ప్రభుత్వ సంస్థల, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల నుంచి అన్ని రకాల అనుమతులను పొంది ముందుకు సాగామని కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు.

అంతేకాదు గత ప్రభుత్వం సాధించిన విజయాల్ని తక్కువ చేసేందుకు ప్రభుత్వం విద్యుత్‌ అంశాలపై విచారణ కమిషన్‌ ఏర్పాటు చేసిందని దుయ్యబట్టారు. విచారణలో నిష్పాక్షికత ఎంత మాత్రం కనిపించడం లేదు. కమిషన్ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదు. విచారణ కమిషన్ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా వైదొలగాలని జస్టిస్ నరసింహారెడ్డి విజ్ఞప్తి చేశారు. దీనిపై అధికార కాంగ్రెస్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ వివాదం కొనసాగుతుండగానే.. మంగళవారం ఉదయం జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌ను రద్దు చేయాలని కోరుతూ కేసీఆర్‌  హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. నిబంధనల మేరకే విద్యుత్‌ కొనుగోలు జరిగిందని పునరుద్ఘాటించారు.

సాయంత్రానికి జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌ కేసీఆర్‌కు రెండోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 27లోపు వివరణ ఇవ్వాలని స్పష్టం చేశారు. మరి ఈ నోటీసులపై కేసీఆర్‌ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement