breaking news
Power committee
-
పవర్ కమిషన్ నివేదికపై బీఆర్ఎస్ అభ్యంతరం
-
TG: పవర్ కమిషన్ కొత్త చైర్మన్ జస్టిస్ మదన్ లోకూర్
సాక్షి,హైదరాబాద్: విద్యుత్ విచారణ కమిషన్ కొత్త ఛైర్మన్‌గా తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ మదన్ భీమ్రావు లోకూర్‌ను నియమించింది. గతంలో పవర్ కమిషన్‌కు చైర్మన్‌గా వ్యవహరించిన జస్టిస్ నరసింహారెడ్డి సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇటీవలే ఆ స్థానం నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. దీంతో కొత్త చైర్మన్‌గా ప్రభుత్వం మదన్ లోకూర్‌ను ఎంపిక చేసింది. జస్టిస్ మదన్ లోకూర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా పనిచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలతో పాటు యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ల నిర్మాణాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం జుడ్యీషియల్ ఎంక్వైరీ వేసింది. ఈ జ్యుడీషియల్ కమిషన్ ఇక ముందు జస్టిస్ మదన్ లోకూర్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగించనుంది. -
అందుకే ప్రెస్ మీట్ నిర్వహించా: జస్టిస్ నరసింహారెడ్డి
ఢిల్లీ, సాక్షి: విచారణ కమిషన్లు వేసేదే ప్రజలకు అన్ని విషయాలు తెలియాలని, అలాంటిది తనపై అబద్ధాలు ప్రచారం చేశారని జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే పవర్ కమిషన్ చైర్మన్ తప్పుకున్నట్లు చెప్పిన ఆయన.. సాక్షితో మాట్లాడారు.విచారణ కమిషన్ చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్నాక కొన్ని ఊహాగానాలకు చెక్‌పెట్టేందుకే ప్రెస్ మీట్ పెట్టాను. పైగా ఆ ప్రెస్ మీట్లో ఎక్కడా నా అభిప్రాయం చెప్పలేదు. సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అయినట్లు ప్రచారం జరిగింది. కనీసం ఆయనతో ఫోన్లో కూడా మాట్లాడలేదు. పవర్ కమిషన్ విచారణలో ఎవరికీ నోటీసులు ఇవ్వలేదు. కమిషన్ తరఫున 28 మందికి లేఖలు రాశా. కేసీఆర్ తప్ప అంతా తమ అభిప్రాయాలు చెప్పారు. వన్ ర్యాంక్.. వన్ పెన్షన్ కమిషన్‌లో నేను పని చేశా. అలాంటిది విచారణ కమిషన్ చైర్మన్ పదవి నుంచి తప్పుకోమని కేసీఆర్ లేఖ రాశారు. ఆ లేఖలోనూ సమాజం అంగీకరించని భాష వాడారు. ఎన్నో కమిషన్ చైర్మన్లు ప్రెస్ మీట్లు పెట్టినా రాని అభ్యంతరం నాపైనే ఎందుకు వచ్చిందో తెలియడం లేదు.అందరి అభిప్రాయాలు తీసుకుని నేను నివేదిక కూడా సిద్ధం చేశా. నేను ఇచ్చే రిపోర్ట్ నా వ్యక్తిగతం.. దానిపై ఎవరికీ హక్కులేదు. కమిషన్ ఇచ్చే నివేదికను ప్రభుత్వం అంగీకరించొచ్చు.. అంగీకరించకపోవచ్చు. ఆ ఇచ్చిన రిపోర్ట్‌ను తప్పని ఎవరైనా సవాల్ చేయొచ్చు అని అన్నారాయన. అంతకు ముందు..కేసీఆర్ పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారన సందర్భంగా అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. విచారణ కమిషన్ చైర్మన్ పదవి నుంచి తాను తప్పుకుంటున్నట్లు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఇచ్చిన లేఖను తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాది సుప్రీం బెంచ్‌కు సమర్పించారు. -
పవర్ కమిషన్ కొత్త చైర్మన్‌పై కొనసాగనున్న సస్పెన్స్
ఢిల్లీ, సాక్షి: తెలంగాణ విద్యుత్ కమిషన్‌కు కొత్త చైర్మన్ విషయంలో ఉత్కంఠ కొనసాగనుంది. చైర్మన్‌ను మార్చాల్సిందేనని సుప్రీం కోర్టు నుంచి ఆదేశాలు వెలువడిన కాసేపటికే కొత్త చైర్మన్ పేరును ప్రకటిస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. కానీ, కాసేపటికే కొత్త పేరును సోమవారం ప్రకటిస్తామని సుప్రీం కోర్టుకు నివేదించింది.అయితే ప్రస్తుత చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి అప్పటిదాకా కొనసాగడానికి కూడా వీల్లేదని, ఆయన కమిటీలోని సభ్యులు కూడా కొనసాగకూడదని సుప్రీం కోర్టు తెలంగాణ సర్కార్‌ను ఆదేశించింది. ఆ సమయంలోనే అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. విచారణ నుంచి తప్పుకొంటున్నట్లు జస్టిస్ నర్సింహారెడ్డి ఆయన రాసిన లేఖ కాపీని సుప్రీంకోర్టుకు ప్రభుత్వ న్యాయవాదులు అందజేశారు. దీంతో కొత్త చైర్మన్‌ను నియమించేందుకు తెలంగాణ ప్రభుత్వానికి కోర్టు టైమిచ్చింది. అంతేకాదు.. కొత్త జడ్జి, కమిషన్ కాలపరిమితి విధానాలను కొత్త నోటిఫికేషన్లో వెల్లడించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అంతకు ముందు.. తెలంగాణలో విద్యుత్ ఒప్పందాలపై ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ ఛైర్మన్‌ను మార్చాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. విచారణ కొనసాగుతున్న టైంలోనే.. కమిషన్ ఛైర్మన్ జస్టిస్ నర్సింహారెడ్డి ప్రెస్‌మీట్ నిర్వహించడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం తెలిపింది.సంబంధిత వార్త: పవర్ కమిషన్‌కు సుప్రీం షాక్బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాల్లో జరిగిన అక్రమాలపై విచారణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ నర్సింహారెడ్డితో జ్యుడిషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు సైతం విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది. అయితే ఈ విచారణను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టుకు వెళ్లే ముందు హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ అనుకూల ఫలితం రాకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టులో ఇరుపక్షాల తరఫున సీనియర్ న్యాయవాదులు సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభిషేక్ మనుసింఘ్వీ, సిద్ధార్థ్ లూథ్రా.. కేసీఆర్ తరఫున ముకుల్ రోహత్గీ వాదించారు. వాదనల అనంతరం విచారణ కమిషన్ ఛైర్మన్‌ను మార్చాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
కేసీఆర్‌కు మరోసారి పవర్ కమిషన్ నోటీసులు
సాక్షి,హైదరాబాద్ : మాజీ సీఎం కేసీఆర్‌కు పవర్ కమిషన్ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకు కమిషన్‌కు వచ్చిన సమాచారంపై అభిప్రాయం చెప్పాలని నోటీసులో పవర్ కమిషన్ పేర్కొంది. ఈ నెల 27 లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కేసీఆర్‌తో పాటు జగదీష్ రెడ్డి, మరికొంత మందికి నోటీసులు పంపింది పవర్ కమిషన్. ఇప్పటికే యాదాద్రి,భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్‌గఢ్ నుంచి కరెంటు కొనుగోలు ఒప్పందం అంశాల్లో తీసుకున్ననిర్ణయాలపై మాజీ సీఎం కేసీఆర్‌కు జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 15లోగా రాతపూర్వకంగా సమాధానాలు పంపాలని నిర్ధేశించింది. దీనిపై కేసీఆర్ స్పందిస్తూ జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డికి కేసీఆర్ 12 పేజీల సుధీర్ఘ లేఖ రాశారు.ఎలక్ట్రి సిటీ యాక్ట్ 2003ను అనుసరిస్తూ, వీటన్నింటికీ అవసరమైన కేంద్ర ప్రభుత్వ సంస్థల, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల నుంచి అన్ని రకాల అనుమతులను పొంది ముందుకు సాగామని కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు.అంతేకాదు గత ప్రభుత్వం సాధించిన విజయాల్ని తక్కువ చేసేందుకు ప్రభుత్వం విద్యుత్ అంశాలపై విచారణ కమిషన్ ఏర్పాటు చేసిందని దుయ్యబట్టారు. విచారణలో నిష్పాక్షికత ఎంత మాత్రం కనిపించడం లేదు. కమిషన్ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదు. విచారణ కమిషన్ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా వైదొలగాలని జస్టిస్ నరసింహారెడ్డి విజ్ఞప్తి చేశారు. దీనిపై అధికార కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ వివాదం కొనసాగుతుండగానే.. మంగళవారం ఉదయం జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌ను రద్దు చేయాలని కోరుతూ కేసీఆర్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. నిబంధనల మేరకే విద్యుత్ కొనుగోలు జరిగిందని పునరుద్ఘాటించారు.సాయంత్రానికి జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కేసీఆర్‌కు రెండోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 27లోపు వివరణ ఇవ్వాలని స్పష్టం చేశారు. మరి ఈ నోటీసులపై కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. -
తెలంగాణ విద్యుత్ కమిషన్‌పై హైకోర్టుకు కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ కమిషన్‌పై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, కొత్త థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌ను రద్దు చేయాలని కోరుతూ రిట్ పిటిషన్ దాఖలు చేశారు.జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటు సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఉందని ఆ పిటిషన్లో కేసీఆర్ పేర్కొన్నారు. నిబంధనల మేరకే విద్యుత్ కొనుగోలు జరిగిందని పునరుద్ఘటించారు. జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్మీట్లు పెట్టి మరీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ కేసులో విద్యుత్ కమిషన్, జస్టిస్ నరసింహారెడ్డి, ఎనర్జీ విభాగాలను ప్రతివాదులుగా ఉన్నారు. -
కేసీఆర్‌కు పవర్ కమిషన్ నోటీసులు
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు మంగళవారం పవర్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఛత్తీస్‌గఢ్‌తో జరిగిన విద్యుత్ ఒప్పందాలలో తన పాత్రను తెలియజేయాలని ఆయన్ని ఆ నోటీసుల్లో కమిషన్ కోరింది. పవర్ కమిషన్ నోటీసుల ప్రకారం.. జూన్ 15వ తేదీలోపు సమాధానం ఇవ్వాలని కోరింది. అయితే.. జూలై 30 వరకు సమాధానం ఇవ్వడానికి సమయం కావాలని కేసీఆర్ అడిగినట్లు సమాచారం. ఒకవేళ కేసీఆర్ ఇచ్చే వివరణను బట్టి నేరుగా విచారణకు పిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన ఇచ్చే సమాధానం సంతృప్తిగా లేకపోతే ప్రత్యక్ష విచారణకు పిలుస్తామని పవర్ కమిషన్ సంకేతాలిస్తోంది.గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని పేర్కొంటూ జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలోని జ్యుడీషియల్ కమిషన్ నియమించింది తెలంగాణ సర్కార్. ఈ క్రమంలో కమిషన్ విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. గత రెండు రోజులుగా బీఆర్ఎస్ హయాంలో పని చేసిన కొందరు అధికారుల్ని విచారణకు పిలిచి.. వివిధ కీలకాంశాలపై ప్రశ్నించింది ఈ కమిషన్. నిన్న మాజీ సీఎండీ ప్రభాకర్‌రావును ప్రశ్నించిన జస్టిస్ నరసింహారెడ్డి.. ఇవాళ మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు పంపించడం గమనార్హం. -
పీపీఏలతో పని లేదు
-
పీపీఏలతో పని లేదు
తెలంగాణకు విద్యుత్ కోటాపై ఏపీజెన్కోకు ఎస్ఆర్పీసీ ఆదేశం గ్రిడ్ రక్షణకోసం కోటా విధానాన్ని అమలు చేయాల్సిందే సాక్షి, హైదరాబాద్: విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏలు) ఉన్నా, లేకున్నా ప్రస్తుతం అమలవుతున్న కోటా మేరకు తెలంగాణకు విద్యుత్ ఇవ్వాల్సిందేనని దక్షిణ ప్రాంతీయ విద్యుత్ కమిటీ ఏపీజెన్కోను ఆదేశించింది. పీపీఏలు అమల్లో ఉన్నాయా? లేదా? అన్న విషయంతో తమకు సంబంధం లేదని, విద్యుత్ సరఫరా వ్యవస్థ (గ్రిడ్) రక్షణ ముఖ్యమని... జూన్ రెండు వరకు అమల్లో ఉన్న కోటా విధానాన్ని అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. మంగళవారం బెంగళూరులో దక్షిణ ప్రాంతీయ విద్యుత్ కమిటీ (ఎస్ఆర్పీసీ) సమావేశం జరిగింది. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఆయా రాష్ట్రాల ట్రాన్స్‌కోల చీఫ్ ఇంజనీర్లు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ (సీఈఏ), జాతీయ విద్యుత్ ప్రసార సంస్థ (ఎన్ఎల్డీసీ) అధికారులు పాల్గొన్నారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు ఉన్నాయా? లేదా? అన్నది తమ పరిధిలోని అంశం కాదని.. దానిని కేంద్ర విద్యుత్ శాఖ చూసుకుంటుందని, అప్పటి వరకు యథాతథ స్థితిని కొనసాగించాల్సిందేనని ఎస్ఆర్పీసీ స్పష్టం చేసింది. దీంతో తెలంగాణ రాష్ట్రానికి కొంతకాలంగా ఆగిపోయిన 541 మెగావాట్ల విద్యుత్ కోటాను పునరుద్ధరించాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై పడింది. దక్షిణాది రాష్ట్రాల మధ్య గ్రిడ్ సురక్షితంగా ఉండడానికి, ఆయా రాష్ట్రాల విద్యుత్ వినియోగాన్ని నియంత్రించడానికి దక్షిణ ప్రాంతీయ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఆర్ఎల్డీసీ) బాధ్యత వహిస్తున్న సంగతి తెలిసిందే. మేం చట్టాన్ని ఉల్లంఘించలేదు..: ‘‘పీపీఏలకు ఈఆర్సీ ఆమోదం లేదు. మా రాష్ట్రంలో ఉన్న విద్యుత్ ప్రాజెక్టులను మేమే వినియోగించుకుంటాం. మేం విభజన చట్టాన్ని ఉల్లంఘించడం లేదు. - ఏపీ నుంచి భేటీకి హాజరైన చీఫ్ ఇంజనీర్ పీపీఏల రద్దు అధికారం వారికి లేదు: ‘‘విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను రద్దు చేసుకునే అధికారం ఏపీజెన్కోకు లేదు. విభజన చట్టం ప్రకారం పీపీఏలు కొనసాగుతాయి. - తెలంగాణ తరఫున భేటీకి హాజరైన అధికారులు