మాగంటి మృతి పట్ల రేవంత్‌, కేసీఆర్‌ సంతాపం.. | Political Leaders condolences To BRS MLA Maganti Gopinath | Sakshi
Sakshi News home page

మాగంటి మృతి పట్ల రేవంత్‌, కేసీఆర్‌ సంతాపం..

Jun 8 2025 7:46 AM | Updated on Jun 8 2025 10:31 AM

Political Leaders condolences To BRS MLA Maganti Gopinath

సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ అనారోగ్యం కారణంగా తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపై పలువురు నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

సీఎం రేవంత్‌ సంతాపం..
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం పట్ల సంతాపం ప్రకటించారు. మాగంటి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

కేసీఆర్‌ సంతాపం.. 
ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించిన బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాగంటి మరణం పార్టీకి తీరనిలోటు. ఎంతో కష్టపడి రాజకీయాల్లో అంచలంచెలుగా ఎదిగిన మాగంటి గోపీనాథ్ ఎంతో సౌమ్యుడుగా ప్రజానేతగా పేరు సంపాదించారని తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజక వర్గ ఎమ్మెల్యేగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, హైదరాబాద్ నగర సీనియర్ రాజకీయనేతగా మాగంటి తనదైన స్థానాన్ని సంపాదించుకున్నారని మాగంటి జ్ఞాపకాలను స్మరించుకున్నారు. తనను కాపాడుకునేందుకు వైద్యులు చేసిన కృషి, పార్టీ తరఫున చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మాగంటి గోపీనాథ్ మరణంతో శోకతప్తులైన కుటుంబ సభ్యులు మిత్రులు అభిమానులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

కేటీఆర్‌ దిగ్బ్రాంతి..
మాగంటి గోపీనాథ్ అకాల మరణం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధికి మాగంటి గోపినాథ్ చేసిన కృషిని గుర్తు చేసుకున్న కేటీఆర్. ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. మాగంటి మృతి పార్టీకి తీరని లోటు అని చెప్పుకొచ్చారు. 

హరీశ్ రావు సంతాపం..
మాగంటి గోపినాథ్ అకాల మరణం అత్యంత బాధాకరం. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. వారి మృతి బీఆర్‌ఎస్‌కు తీరని లోటు. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిన వారి జీవితం ఆదర్శం. గోపినాథ్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను.

బండి సంజయ్‌ సంతాపం..
మాగంటి గోపీనాథ్ మృతిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంతాపం. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవలందిస్తున్న నాయకుడి మరణం ప్రజలకు తీరనిలోటు. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థిసున్నా. మాగంటి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. 
 

Advertisement
 
Advertisement
Advertisement