నుమాయిష్ పర్యటన వాయిదా వేసుకోండి: సీపీ సజ్జనార్‌ | Police postpone Numaish's visit | Sakshi
Sakshi News home page

నుమాయిష్ పర్యటన వాయిదా వేసుకోండి: సీపీ సజ్జనార్‌

Jan 24 2026 5:45 PM | Updated on Jan 24 2026 6:08 PM

Police postpone Numaish's visit

సాక్షి హైదరాబాద్: నాంపల్లిలో అగ్నిప్రమాదం సంభవించిన నేపథ్యంలో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నాంపల్లిలోని నుమాయిష్ ఎగ్జిబిషన్ పర్యటన వాయిగా వేసుకోవాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్  సూచించారు. అగ్నిప్రమాదంతో పాటు శనివారం కావడంతో నాంపల్లిలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.  

దాంతో  అగ్ని ప్రమాదం జరిగిన చోట రెస్కూ చేయడం కష్టంగా మారింది.  దాంతో పోలీసులు  ఎవరూ ఎగ్జిబిషన్‌ సందర్శించే వారు తమ  ప  ర్యటనను వాయిదా వేసుకోవాలని నగరవాసులకు విజ‍్క్షప్తి చేశారు. 

కాగా, నాంపల్లిలోని ఓ ఫర్నిచర్ షాపులో అగ్ని ప్రమాదం జరిగింది. నాలగు అంతస్థుల భవనంలో భారిీ ఎత్తున మంటలు వ్యాపించాయి. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఎనిమిది ఫైరింజన్లతో మంటలు ఆర్పుతున్నాయి. అయితే భవనంలో వాచ్ మెన్ కుటుంబంలోని ఇద్దరు పిల్లలతో అఖిల్, ప్రణీతతో పాటు మరో నలుగురు అగ్నిప్రమాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. దీంతో బాధితుల బంధువులు తీవ్ర అందోళన చెందుతున్నారు.

ప్రమాదం జరిగిన స్థలం ఫర్నిచర్‌కు చెందినది కావడంతో భవనం సెల్లార్‌లో పెద్దఎత్తున ఫర్నీచర్ సామాగ్రి పెట్టి ఉంచారు. దీంతో సహాయక చర్యలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీంతో అగ్నిమాపక సిబ్బంది రోబో ఫైర్‌ మిషన్ల ద్వారా సహాయక చర్యలు చేపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement