సీఎం కేసీఆర్‌ పర్యటనలో పోలీసుల అత్యుత్సాహం

Police Over Action In CM KCR Sircilla District Tour - Sakshi

సాక్షి, రాజన్న సిరిసిల్ల: జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటనలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. దీంతో టీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.‌ సిరిసిల్ల నుంచి సర్దాపూర్‌లో మార్కెట్ యార్డు ప్రారంభోత్సవానికి సీఎం వెళ్తుండగా చంద్రపేట మాజీ సర్పంచ్ టీఆర్ఎస్ నాయకులు, వికలాంగుడు శ్రీనివాస్ రోడ్డు దాటుతుండగా, అప్పటికే సీఎం కాన్వాయ్ అక్కడికి చేరడంతో నిరసన తెలిపేందుకు వస్తున్నాడేమోనని పోలీసులు అతని లాగేయడంతో కింద పడ్డారు.

తాను టీఆర్ఎస్ నాయకున్నేనని చెప్పినా వినకుండా పోలీసులు కింద పడేసి తొక్కారని శ్రీనివాస్ రోడ్డుపై బైఠాయించారు. స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులకు స్థానికుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుని పరిస్థితి ఉద్రిక్తంగా మారింది‌. శ్రీనివాస్‌ను తన్నిన పోలీస్.. క్షమాపణ చెప్పాలని స్థానికులు డిమాండ్  చేశారు. పోలీస్ అధికారి అక్కడికి చేరుకుని స్థానికులను సముదాయించడంతో ఆందోళన సద్దుమణిగింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top