
సాక్షి, హైదరాబాద్: మరోసారి నగరంలో రేవ్ పార్టీ కలకలం రేపింది. కొండాపూర్‌లో ఓ విల్లాలో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఏపీకి చెందిన 11 మందిని ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడకు చెందిన వ్యక్తుల కనుసన్నలో రేవ్ పార్టీ జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. డబ్బున్న బడాబాబులను తీసుకొచ్చి రేవ్ పార్టీ నిర్వహిస్తున్నారు.
కాగా, రెండు రోజుల క్రితం మాదాపూర్‌లో సైబర్ టవర్స్ దగ్గర అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకొని నిర్వహిస్తున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే. 14 మంది యువకులు, ఆరుగురు యువతులను ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బర్త్‌డే పార్టీ సందర్భంగా రేవ్ నిర్వహించారు. నిర్వాకుడు నాగరాజ్ యాదవ్‌తో పాటు 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఐదుగురికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపివేశారు. విదేశీ మద్యంతో పాటు డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
