
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల సందర్భంగా పలుచోట్ల ఉద్రిక్తర పరిస్థితులు నెలకొంటున్నాయి. కొన్ని చోట్ల బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో, పోలీసుల లాఠీలకు పనిచెబుతున్నారు.
సూర్యాపేటలో బీఆర్‌ఎస్ Vs కాంగ్రెస్
సూర్యాపేటలోని మఠంపల్లిలో ఉద్రిక్తత.
ఓటేసేందుకు వెళ్లిన వ్యక్తిని చితకబాదిన బీఆర్‌ఎస్ నాయకులు
కాంగ్రెస్ వాళ్లు ఓటు వేసేందుకు వస్తే చంపుతామంటూ బెదిరింపులు.
వ్యక్తి మీద దాడి చేయడంతో అతడికి గాయాలు. ఆసుపత్రికి తరలింపు.
ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత..
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత.
ఖానాపూర్ మున్సిపాలిటీ దగ్గర కాంగ్రెస్, బీఆర్‌ఎస్ శ్రేణుల మధ్య గొడవ.
లాఠీఛార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు.
లాఠీలకు పనిచెప్పడంతో పరుగులు తీసిన కార్యకర్తలు, ఓటర్లు.
పలువురికి గాయాలు.
వికారాబాద్..
తాండూర్ మండలం కరన్‌కట్‌లో నగదు కలకలం.
కోటవీధిలోని పోలింగ్ కేంద్రం దగ్గర డబ్బుల పంపిణీ.
పోలీసుల రాకతో డబ్బును వదిలేసి పారిపోయిన గుర్తుతెలియని వ్యక్తులు.
రూ. 7.45లక్షలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.
జనగామ..
జనగామ జిల్లా కేంద్రంలోని ప్రెస్టన్ పాఠశాల వద్ద స్వల్ప ఉద్రిక్తత..
పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి పోలింగ్ సరళిని పర్యవేక్షించిన బీఆర్ఎస్ అభ్యర్థి పళ్ళ రాజేశ్వర్ రెడ్డి.
పోలింగ్ స్టేషన్ వద్ద ఎక్కువసేపు ఉన్నాడని అభ్యంతరం తెలిపిన కాంగ్రెస్ నాయకులు, సీపీఎం నాయకులు.
దీంతో, ఇరువర్గాల మద్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది.
రంగంలోకి దిగిన ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు..
పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకొన్న ఏసీపీ దేవేందర్ రెడ్డి..
కల్లూరులో తోపులాట..
ఖమ్మంలోని కల్లూరు మండలం చెన్నూరు గ్రామంలో పొలింగ్ బూత్ వద్ద బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల నేతల మధ్య తోపులాట
పోలింగ్ బూతు వద్ద బీఆరెఎస్ నాయకులు పార్టీ కండువాలు కప్పుకొని ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని అడ్డుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు.
ఇరువర్గాల వారిని చెదరగొట్టిన పోలీస్ బలగాలు
ఖమ్మం..
సత్తుపల్లి మండలం సత్యంపేట గ్రామంలో ఓటు వేయకుండా పోలింగ్‌ను బహిష్కరించిన గ్రామస్తులు
తమ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని ఓటును బహిష్కరించిన గిరిజన గ్రామస్తులు.
ఎన్నికల వేళ నాగార్జునసాగర్ అంశంపై రేవంత్ కీలక వ్యాఖ్యలు..
నాగార్జున సాగర్ వివాదంపై సీఈవో చర్యలు తీసుకోవాలి.
కావాలనే వ్యూహాత్మకంగా ఈ వివాదం సృష్టించారు.
ఎవరు, ఎందుకు, ఏం ఆశించి ఈ ప్రయత్నాలు చేస్తున్నారో ప్రజలకు తెలుసు.
సాగర్ డ్యామ్ అక్కడే ఉంటుంది. నీళ్లు ఎక్కడికి పోవు.
ఏ రాష్ట్రంతో సమస్య ఉన్నా.. సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలి.
ఇలాంటి కుట్రలు ఎన్నికలపై ప్రభావం చూపవు.