తరతరాల పట్టు'కోక' | Pochampally Maggam competing with international brands | Sakshi
Sakshi News home page

తరతరాల పట్టు'కోక'

Aug 7 2026 5:59 AM | Updated on Aug 7 2026 5:59 AM

Pochampally Maggam competing with international brands

అంతర్జాతీయ బ్రాండ్స్‌తో పోటీపడుతున్న పోచంపల్లి మగ్గం

డిజిటల్‌ బాటలో సొంత మార్కెటింగ్‌ 

సాక్షి, యాదాద్రి: తరతరాల సంస్కృతీ సంప్రదాయం.. జీవనోపాధికి నిలువెత్తు రూపమైన చేనేత పరిశ్రమ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు జీవం పోస్తోంది. ముడిసరుకుల ధరల భారం, మార్కెటింగ్‌ ఇబ్బందులు ఎదురైనా నేతన్నల మగ్గం సప్పుడు ఆగడం లేదు. ఆధునిక యుగంలో పడుగు పేకల చీరల తయారీ మగ్గానికి డిజిటల్‌ తోడై కొత్త ఆశలు చిగురింపజేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ బ్రాండ్స్‌తో ఆకట్టుకుంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా 20 వేల మగ్గాలపై చేనేత కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. పోచంపల్లి ఇక్కత్, గద్వాల, సిరిసిల్ల, నారాయణపేట, సిద్దిపేట వంటి ప్రత్యేక శైలులు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి.

ఒడిదుడుకులు అధిగమిస్తూ..
నూలు, పట్టు, రంగుల ధరలు రోజురోజుకూ విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో చీరల తయారీలో వస్త్రాలకు తగినంత గిట్టు బాటు ధర దక్కడం లేదు. మరో వైపు సొసైటీలు, మాస్టర్‌ వీవర్ల వద్ద కొనుగోలు దారులు లేక కోట్లాది రూపాయల విలువైన సరుకు నిల్వ ఉండిపో తోంది. ఈ పరిస్థితిని అధిగమించడానికి నేతన్నలు చీరలు, వస్త్రాల అమ్మకాల కోసం కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. 

విశ్వవేదికపై ఇక్కత్‌.. 
ప్రపంచ ’సిల్క్‌ సిటీ’గా గుర్తింపు పొందిన భూదాన్‌ పోచంపల్లిని గతేడాది మే 15న అంతర్జాతీయ సుందరీమణులు సందర్శించారు. ఇక్క త్‌ పట్టు చీరల తయారీ, డిజైన్లు, అద్దకం ప్రక్రి యను ప్రత్యక్షంగా చూసి మురిసిపోయారు. తెలంగాణ సంస్కృతికి నిదర్శనమైన ఈ కళను ప్రశంసిస్తూ ‘తెలంగాణ జరూర్‌ ఆనా’అంటూ నినదించారు. అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్‌ పర్యటనల సందర్భంలో ఆ దేశ ప్రథమ మహిళ బ్రిగిట్టే మేక్రాన్‌కు విశిష్టమైన పోచంపల్లి పట్టు శాలువాను బహుమతిగా అందించడం చేనేత కళాకారులకు దక్కిన అంతర్జాతీయ గౌరవం. 

సాంకేతికత జోడించి.. 
అనాదిగా వస్తున్న ఈ వృత్తిలోకి ఉన్నత చదువులు చదివిన యువత అడుగుపెడుతుండటం విశేషం. ఉద్యోగాల వైపు వెళ్లకుండా తాతలు, తండ్రులు చూపిన బాటలోనే కళను కొనసాగిస్తూ ఉపాధి పొందుతుండటమే కాకుండా మరికొందరికి జీవనోపాధి కల్పిస్తున్నారు. సాంకేతికతను జోడించి ఇక్కత్‌ డిజైన్లలో అనేక ప్రయోగాలు, మార్పులు చేస్తూ దేశవిదేశాల్లో విజయాలు సాధిస్తున్నారు. పోచంపల్లి ఇక్కత్‌ టై అండ్‌ డిజైన్లలో కొత్త పుంతలు తొక్కిస్తున్నారు.

విదేశాల నుంచి ఆర్డర్లు 
వీవర్స్‌ నుంచి నేరుగా కస్టమర్లకు వస్త్రాలను అందించాలని, తాము తయారు చేసిన వస్త్రాలను స్వతహాగా మార్కెటింగ్‌ చేసుకోవాలని యువత ఆలోచనలకు పదును పెడుతోంది. తమ ఉత్పత్తుల ప్రచారం కోసం ఇన్‌స్ట్రాగామ్, యూట్యూబ్‌లో రీల్స్‌ చేసి చీరల ప్రత్యేకతలు, రంగులు, అల్లిక నాణ్యతను వివరిస్తున్నారు. అమెరికా, లండన్, కెనడాతోపాటు హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, బెంగుళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై నుంచి ఎక్కువగా ఆర్డర్స్‌ వస్తున్నాయి.

చేనేత వస్త్రం కాదు.. సంస్కృతి
చేనేత అంటే వస్త్రం కాదు,మన సంస్కృతికి దర్పణం. ప్రకృతి నుంచి వచ్చే దారాలతో వస్త్రం నేయడం వల్ల వేడిలో చల్లగా, చలిలో వెచ్చగా ఉంటాయి. చేనేత వస్త్రాలను ధరించడం వల్ల అందంతో పాటు ఎంతో హుందాత నంగా కనిపి స్తుంది. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించి నేతన్నలను ప్రోత్సహించాలి. – రష్మీ ఠాకూర్,  తెలంగాణ ఇక్కత్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌

చేనేత కళ గొప్పగా ఉంది
ఇండియాకు మొదటిసారి వచ్చాను. ప్రాచీన చేనేత కళను తెలుసుకోవడానికి పోచంపల్లిని సందర్శించడం గొప్ప అను భూతినిచ్చింది. ఇక్కడి చేనేత కళాకారులు రూపొందిస్తున్న చేనేత వస్త్రాలు చాలా బాగు న్నాయి.నూతన ప్రయోగా లతో చేనేత కళను కాపాడుకోవడం అభినందనీయం.  – మిల్లిహట్టన్, కెనడా దేశ టూరిస్ట్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement