మయూరానికి ప్రేమతో...  | PM Modi Shares Video Of Him Feeding Peacocks | Sakshi
Sakshi News home page

మయూరానికి ప్రేమతో... 

Aug 24 2020 1:24 AM | Updated on Aug 24 2020 8:44 AM

PM Modi Shares Video Of Him Feeding Peacocks - Sakshi

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ఆదివారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో నెమలికి ఆహారం అందిస్తున్న దృశ్యమిది. ఇదే కాంపౌండ్‌లో ఆఫీసు భవనాలు ఉన్నాయి. వీటి మధ్య నిత్యం మోదీ మార్నింగ్‌ వాక్‌ చేస్తుంటారు. ప్రధాని నడక, ఇతర వ్యాయామాలు చేస్తుంటే పరిసరాల్లో నెమళ్లు తచ్చాడుతుంటాయట. వీటి స్వేచ్ఛకు భంగం వాటిల్లకుండా చూసుకుంటారాయన. ప్రకృతి ప్రేమికుడైన మోదీ తన నివాసంలో పక్షులు గూళ్లు పెట్టుకునేందుకు వీలుగా ఎత్తైన స్తంభాలతో కూడిన ఆకృతులను కూడా ఏర్పాటు చేశారు. ఆదివారం వాకింగ్‌ చేస్తున్నపుడు తన దగ్గరకు వచ్చిన నెమళ్లకు మోదీ కింద కూర్చొని మరీ ఇలా ఆహారం అందించారు. తన మార్నింగ్‌ వాక్‌ దృశ్యాలతో కూడిన 107 సెకన్ల నిడివిగల వీడియోను ప్రధాని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.    

Advertisement
 
Advertisement
Advertisement