సాక్షి, హైదరాబాద్: నేడు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పుట్టినరోజు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి (Revanth Reddy) ప్రముఖులు పుట్టినరోజు శుభకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా విషెస్ చెబుతున్నారు.
తాజాగా సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్‌రెడ్డి ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా పోస్టు చేశారు. ఇక, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా తెలంగాణ సీఎంకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
Birthday greetings to Telangana Chief Minister Revanth Reddy Garu. May he be blessed with a long and healthy life.@revanth_anumula
— Narendra Modi (@narendramodi) November 8, 2025
కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఫోన్ చేసి సీఎం రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ నేతలు రేవంత్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు.


