సాక్షి, హైదరాబాద్: నగరంలో కండ్లకలక కేసులు కలవరం పుట్టిస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం పదుల సంఖ్యలోనే వెలుగుచూసిన కేసులు తాజాగా వేలల్లో నమోదయ్యాయి. అయితే, చికిత్స కోసం వెళ్లిన బాధితులకు ఇబ్బందులు తప్పడం లేదు. హైదరాబాద్‌లోని సరోజినిదేవి కంటి ఆస్పత్రిలో వసతులు కరువయ్యాయంటూ రోగులు ఆవేదన వ్యక్తం చేశారు.

చికిత్స అందించే డాక్టర్ల కొరతకు తోడు.. మెడిసిన్ తీసుకునేందుకు కూడా పేషంట్లు బారులు తీరారు. ఆస్పత్రి యాజమాన్యం ముందస్తుగా చర్యలు చేపట్టకపోవడంతో బాధితులు ఒకేచోట గుమిగూడాల్సిన పరిస్థితి తలెత్తింది. మందులకు అందించేందుకు ఒకే కౌంటర్ అందుబాటులో ఉండటంతో దాదాపు 2 గంటలు లైన్‌లో వేచి ఉంటే తప్ప మెడిసిన్ తీసుకునే పరిస్థితి లేదు.

కాగా, వైరస్ లేదా బ్యాక్టీరియా వల్ల వచ్చే కండ్లకలక ఒకరి నుంచి ఒకరికి వేగంగా వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా గుంపుగా ఉన్న ప్రదేశాల్లో ఈ వ్యాధి సొందరగా ఇతరులకు సోకుతుంది. కండ్లకలకను పింక్ ఐ లేదా ఐ ఫ్లూ అని అంటారు.
(చదవండి: ఆ అలవాటే కరోనా అటాక్‌కి ప్రధాన కారణం! వెలుగులోకి విస్తుపోయే నిజాలు!)
✅గత కొద్ది రోజులుగా కళ్ల కలక 👁️కేసులు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
— PIB in Telangana 🇮🇳 (@PIBHyderabad) August 2, 2023
✅మరి ఇలాంటి సమయంలో చేయాల్సినవి, చేయకూడనివి తెలిస్తే త్వరగా నయం అవుతుంది.
✅అవేంటో కింది ఇన్ఫోగ్రాఫ్ ద్వారా తెలుసుకోండి#Conjuctivitis #HealthForAll #SwasthaBharat #EyeFlu #EyeConjuctivitis pic.twitter.com/EZ7TLH6axd

కళ్ల కలక లక్షణాలు!
— PIB in Telangana 🇮🇳 (@PIBHyderabad) August 2, 2023
👁🗨కళ్ళలో నొప్పి, మంట, దురద
👁🗨కళ్ళు ఎర్రగా మారడం
👁🗨కళ్ళ నుంచి తరుచుగా నీరు కారడం
👁🗨కళ్ళు వాపు
👁🗨నిద్ర లేచిన తర్వాత కనురెప్ప అతుక్కుపోవడం
👁🗨నిర్లక్ష్యం చేస్తే కండ్ల నుంచి చీము కారడం#Conjuctivitis #HealthForAll #SwasthaBharat #EyeFlu #EyeConjuctivitis pic.twitter.com/rMmPxOdB0g


