22 సేవలను నేరుగా పొందే సదుపాయానికి విఘాతం
టీ–యాప్ ఫొలియో నుంచి ఈ–సేవకు బదిలీతో నిలిచిన వైనం
సారథి ఏర్పాటు తరువాత సాంకేతికంగా మరిన్ని చిక్కులు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీఏ ఆన్‌లైన్ పౌర సేవలకు బ్రేక్ పడింది. వాహనదారులు రవాణా కార్యాలయాలకు వెళ్లా ల్సిన అవసరం లేకుండా కలి్పంచిన సదుపాయం నీరుగారిపోయింది. సాంకేతిక చిక్కులను సాకుగా చూపుతూ ఆన్‌లైన్ సేవలను నిర్వీర్యం చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పారదర్శకతకు పాతర వేస్తున్నారని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రవాణా శాఖ పౌరసేవలను పారదర్శకంగా అమలు చేసేందుకు ఆన్‌లైన్ పద్ధతిని ప్రవేశపెట్టారు. టీ–యాప్ ఫొలియో ద్వారా వివిధ రకాల సేవలను పొందే సదుపాయం కల్పించారు.
అయితే ఈ యాప్ నుంచి ఈసేవా కేంద్రాలకు సేవలను బదిలీ చేశారు. అప్పటి నుంచి పౌర సేవల అమల్లో ఆటంకాలు ఎదరువుతున్నాయి. దీంతో వాహనదారులు యధావిధిగా ఆర్టీఏ కార్యాలయాలను సంప్రదించాల్సి వస్తోంది. ఈ క్రమంలో నేరుగా ఆర్టీఏ అధికారులను కలిసేందుకు అవకాశం లేకపోవడం వల్ల ఏజెంట్లను ఆశ్రయిస్తున్నారు. ఆన్‌లైన్‌లో కేవలం 10 నిమిషాల్లో పూర్తయ్యే పని కోసం గంటల తరబడి ఆర్టీఏ కార్యాలయాల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రవాణా శాఖ కొత్తగా ప్రవేశపెట్టిన సారథి సాంకేతిక వ్యవస్థ వల్ల కూడా పౌర సేవలకు విఘాతం ఏర్పడుతోంది. ఇదివరకు సుమారు 22 రకాల పౌర సేవలను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచి్చనప్పటికీ ఇప్పుడు 10 సేవలు కూడా లభించడం లేదు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
ఇదివరకు ఒక్క ‘క్లిక్ ’తో సర్వీసులు...
లెర్నింగ్, డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీ తదితర డాక్యుమెంట్ల పునరుద్ధరణ, డూప్లికెట్ సరి్టఫికెట్లు, పర్మిట్‌లు, వాహన యాజమాన్య బదిలీ, చిరునామా మార్పు, నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ), డూప్లికేట్ ఫిట్‌నెస్, గ్రీన్‌ట్యాక్స్ వంటి వివిధ రకాల పౌరసేవల కోసం వాహనదారులు ఇదిరకు నేరుగా ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు. రవాణా శాఖ వెబ్‌సైట్ నుంచిగానీ, ‘సారథి వెబ్‌సైట్’నుంచిగానీ దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉండేది. ఒక్క క్లిక్‌తో లభించిన ఈ పౌరసేవల కోసం ఇప్పుడు అధికారులను సంప్రదించవలసి రావడం గమనార్హం. ఉదాహరణకు ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఆర్సీ కానీ పోగొట్టుకున్న వాహనదారులు వాటి స్థానంలో ఆన్‌లైన్‌లో డూప్లికేట్ పత్రాలను తీసుకోవచ్చు.
ఒరిజినల్ పత్రాలు పోగొట్టుకున్నట్లుగా ఈ సేవా కేంద్రం నుంచి సమీప పోలీస్‌స్టేషన్ ద్వారా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసుకోవాలి. ఆ తరువాత ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లిస్తే చాలు ఆటోమేటిక్‌గా డూప్లికేట్ ఆర్సీ లేదా డ్రైవింగ్ లైసెన్స్ లభించేది. స్పీడ్‌పోస్ట్ ద్వారా వాహనదారుడి చిరునామాకు స్మార్ట్ కార్డు వచ్చేది. కాలపరిమితి ముగిసిన డ్రైవింగ్ లైసెన్సుల పునరుద్ధరణను కూడా ఆన్‌లైన్ సేవలు ఇప్పటిదాకా అందుబాటులోకి ఉండేవి. వాహనదారులు ఏడాది లోపు ఫీజు చెల్లించి రెన్యువల్ చేసుకోవచ్చు. ఒకవేళ ఏడాది దాటితే కొత్తగా లెర్నింగ్ లైసెన్స్ తీసుకోవాలి. పాత పరి్మనెంట్ లైసెన్స్ స్థానంలో ఇది లభిస్తుంది. కానీ, కొంతకాలంగా ఈ సదుపాయం కూడా నిలిచిపోయింది. దీంతో ఏడాది దాటిన డ్రైవింగ్ లైసెన్స్‌లపై లెరి్నంగ్ తీసుకొనేందుకు వాహనదారులు ఇప్పుడు ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లాల్సి వస్తోంది.
యథావిధిగా సారథి చిక్కులు
రవాణా శాఖ కొత్తగా ప్రవేశపెట్టిన సారథి పరివాహన్ వల్ల మరికొన్ని సాంకేతిక చిక్కులు ఎదురవుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో కీలకమైన లెరి్నంగ్ లైసెన్స్‌లనే సారథి నుంచి అందజేస్తుండగా, ఇక్కడ ఈ సాంకేతిక వ్యవస్థ ఇంకా బాలారిష్టాలను అధిగమించలేకపోతోంది.సారథిలో సకాలంలో స్లాట్‌లు నమోదు కావడం లేదు. ఒక స్లాట్ కోసం కనీసం 5 ఓటీపీలు రావడం వల్ల వాహనదారులు గందగోళానికి గురవుతున్నారు.
ఒక ఓటీపీ 15 సెకన్‌లు మాత్రమే చెల్లుబాటులో ఉంటుంది. ఈ సమయంలో స్లాట్ నమోదు కాకపోతే మరో 15 నిమిషాల వరకు ఎదురుచూడాల్సి వస్తుంది.
చెల్లించిన ఫీజులకు సైతం సకాలంలో రసీదులు లభించడం లేదనే ఫిర్యాదులు ఉన్నాయి.
ఏజెంట్ ఫ్రెండ్లీగా..
సిటిజన్ ఫ్రెండ్లీ దృక్పథంతో ప్రవేశపెట్టిన ఆన్‌లైన్ పౌరసేవలన్నీ ఇప్పుడు ఆఫ్‌లైన్ అయ్యాయి. దీంతో సిటీజన్ ఫ్రెండ్లీ స్థానంలో రవాణా శాఖ ‘ఏజెంట్ ఫ్రెండ్లీ’కి పెద్ద పీట వేస్తోంది. డ్రైవింగ్ లైసెన్స్‌ల రెన్యువల్స్ కోసం వచ్చే సీనియర్ సిటీజన్‌లు కూడా ఈ ఏజెంట్ ఫ్రెండ్లీ విధానాల వల్ల ఇబ్బందులకు గురవుతున్నారు. పనులు పూర్తికావాలంటే ఏజెంట్లకు పెద్ద మొత్తంలో సమరి్పంచుకోవలసి వస్తోంది.
– శ్రీకాంత్‌రెడ్డి, వాహనదారుడు, బంజారాహిల్స్


