
హైదరాబాద్: ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బానిసగా మారిన బీటెక్ విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అత్తాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. గద్వాల్ జిల్లాకు చెందిన పవన్ (30) తన స్నేహితులు గౌతమ్, రోహితులతో కలిసి అత్తాపూర్‌లో ఉంటున్నారు.
కొంత కాలంగా ఆన్‌లైన్ బెట్టింగ్‌కు అలవాటు పడిన పవన్.. తన స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యుల వద్ద అప్పులు చేశాడు. బీటెక్ చదివిన కుమారుడు ప్రయోజకుడు కావాలని పవన్ తండ్రి పెద్ద నర్సింహులు వ్యవసాయాధారిత పంటలపై వచి్చన డబ్బులను కూడా ఇస్తుండేవాడు.
ఆన్‌లైన్ బెట్టింగ్‌లో డబ్బులు సంపాదించుకోవచ్చని భావించిన పవన్ తన బుల్లెట్ వాహనాన్ని, ఐఫోన్‌ను సైతం విక్రయించి మరీ బెట్టింగ్‌లకు పాల్పడేవాడు. స్నేహితులు, బంధువుల వద్ద తీసుకున్న డబ్బులు కూడా పోగొట్టుకోవడంతో మానసికంగా కుంగిపోయిన పవన్ నిరాశతో గదిలో స్నేహితులు లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్నేహితుల ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.